తాను ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల లోనే పుట్టానని.. తనతో గొడవ పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లు ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు సభలో ఆయన మాట్లాడుతూ.. “నేను వస్తున్నానని తెలిసి, హెలికాప్టర్ రాకుండా హెలిపాడ్ తవ్వి వేశారు. వైసీపీ నాయకులకు బానిస గా బ్రతికే వాళ్ళు అంటేనే ఇష్టం. ఆత్మగౌరవంతో బ్రతికే వాళ్ళు అంటే నచ్చదు. నీ ఆత్మగౌరవం పెంచే విధంగా నేను బాధ్యత తీసుకుంటాను. ఆచార్య ఎన్జీరంగా పుట్టిన పొన్నూరు లో జరుగుతున్న సభ లో మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను. హెలిప్యాడ్ ధ్వంసం చేసిన వైసీపీ నాయకులు పైన ఉగ్రవాద కేసులు పెట్టాలి. సాగునీరు ప్రాజెక్టులు ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు.ఉమ్మారెడ్డి లాంటి వారు ఆపార్టీ లోకి వెళ్ళినా జగన్ మరకలు పూసుకోవాల్సిందే. ఈ ప్రభుత్వం పై ప్రశ్నిస్తే కేసులు, పోరాడితే కేసులు పెట్టారు.దాడులు, గోతులు తప్ప ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసింది ఏమీ లేదు. కులాలకు అతీతంగా రాజకీయం చేయాలి. ఎస్సీ, ఎస్టి, మైనార్టీ వర్గాలు అభివృద్ధి చెందాలి.”
READ MORE: Hardeep Nijjar Killing: నిజ్జర్ హత్యలో విచారణ ముగ్గురికే పరిమితం కాదు.. కెనడా పీఎం కీలక వ్యాఖ్యలు..
మన రాష్ట్రంలో యువతకు ఉపాధి, విద్య అవసరం.. వాటిని కల్పించటంలో ఈ ప్రభుత్వం విఫలమైందని పవన్ అన్నారు. “టాక్స్ లు,పెట్రోల్,నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం తప్ప చేసింది ఏమీ లేదు. 1939 లో ఈప్రాంతంలో వేద పాఠశాల వుంది. అర్చకుల పై దాడులు చేస్తున్నారు. బ్రాహ్మణ సంఘానికి అండగా వుంటాం. చేనేత కార్మికులు జీఎస్టీ కడుతున్నారు. రాబోయే రోజుల్లో కల్తీ మద్యం అమ్మిన వారిపై రౌడి షీట్ ఓపెన్ చేస్తాం.అంబటి రాంబాబు పోలవరం గురించి అడిగితే నాకు తెలియదు అంటాడు.మేము సినిమాలో డ్యాన్సులు చేస్తాం. మంత్రి పదవిలో ఉండి డ్యాన్సులు ఎలా చేస్తాడు. నాలాంటి వారిపైన దాడులకు పాల్పడితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి.అంబటి రాంబాబు అల్లుడు రాంబాబు కు మురళికి ఓటు వెయ్యొద్దని చెపుతున్నాడు. కాపు సామాజిక వర్గం పెద్దన్న పాత్ర పోషించాలి. చెల్లికే ఆస్తులు ఇవ్వానివాడు మిమ్మల్ని ఎలా అభివృద్ధి చేస్తాడని అన్నారు.”