ఏపీ వ్యాప్తంగా గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేయలేమని హైకోర్టుకు తెలిపింది ఎన్నికల సంఘం.. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ మార్చలేమని కోర్టుకు తెలిపిన ఈసీ.. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని పేర్కొంది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీపై విరుచుకుపడ్డారు. జగన్ ఒక్కసారి ఛాన్స్ అడిగితే ఇచ్చారు.. ఈ ఎన్నికల్లో మీ భవిష్యత్ కోసం ఛాన్స్ తీసుకోండని అన్నారు. వైసీపీని ఓడించి అప్పుడు తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలని తెలిపారు. లే అవుట్లు వేయాలన్నా.. ఇళ్ళు కట్టాలన్నా వైసీపీ వాళ్లకు లంచాలు ఇవ్వాలని చెప్పారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కాదు.. కన్నాల బాబు అని విమర్శించారు. సింహాచలం భూమి ఆక్రమించి ఎమ్మెల్యే…
తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమికి విజ్ఞప్తి అంటూ కాపు బలిజ సంక్షేమ సేవ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య లేఖ రాశారు. కూటమి మేనిఫెస్టో ప్రజలకు ఆమోదయోగ్యంగానే ఉన్నందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. అలాగే కొన్ని సవరణలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. బీసీలకు ప్రతిపాదించిన పెన్షన్ల వయోపరిమితి 50 సంవత్సరాలు అర్హులైన అన్ని కులాలకు వర్తింపజేయాలని కోరారు. బీసీలకు మాత్రమే ప్రతిపాదించిన రూ. 4 వేల పెన్షన్ అర్హులైన అన్ని కులాలకు వర్తింప చేయాలన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాట్లాడుతూ.. జనసేన పార్టీ లేదు, గుర్తింపు లేదు జగన్ మోహన్ రెడ్డి మీద తొడ కొడతాడంట అని విమర్శించారు. ఈరోజు నీ గ్లాస్ నీ దగ్గర లేదని దుయ్యబట్టారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు ఇద్దరూ ఒకప్పుడు కొట్టుకున్నారని.. మళ్లీ రాజకీయం గురించి కలిసిపోయారని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు రావులపాలెం టు యానాం ఏటిగట్టు రోడ్డు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు.
ఈ ఐదేళ్ళ లో బాగుపడిన వర్గాలు ఎవరు లేరని.. ఈ రోజు నేను పెట్టిన మేనిఫెస్టో తో అన్ని వర్గాలు బాగుపడతాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెనాలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను మూడు పార్టీల నేతలు ఆవిష్కరించారు. ఉమ్మడి మేనిఫెస్టో చంద్రబాబు, పవన్ కల్యాణ్, సిద్జార్థ్ నాథ్ సింగ్లు విడుదల చేశారు.
సినీ నటులతో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ప్రజల ఆస్తులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు చేస్తున్న ప్రచారంపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.