దేశద్రోహ నేరం కింద వచ్చే పదేళ్లపాటు తనను జైల్లో ఉంచాలని ఆ దేశ శక్తివంతమైన పాక్ మిలిటరీ ప్లాన్ చేస్తోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం పేర్కొన్నారు. అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి రూ.5 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో ఈ నెల 9న పారామిలిటరీ రేంజర్లు ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి.
జైల్లో ఉన్న 199 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ శుక్రవారం విడుదల చేయనుంది. దేశ జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణతో 199 మంది భారతీయ మత్స్యకారులను పాక్ అరెస్ట్ చేసింది. వారిని శుక్రవారం విడుదల చేసేందుకు పాక్ అధికారులు సుహృద్భావ సంజ్ఞతో ముందుకు సాగాలని భావిస్తున్నారు.
మూడు దశాబ్దాల క్రితం ఐఏఎస్ అధికారిని హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవించిన గ్యాంగ్‌స్టర్, రాజకీయవేత్త ఆనంద్ మోహన్ విడుదలను సులభతరం చేసిన బీహార్ జైలు నిబంధనల సవరణను సవాలు చేస్తూ పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Protest : ప్రాణంగా ప్రేమించిన ప్రియుడే ఆమె పాలిట యముడిగా మారాడు. నమ్మి తనతో వెళితే చంపి నదిలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియదన్నట్టు ఆత్మహత్యగా చిత్రీకరించబోయాడు. కానీ కుమార్తె మృతి పై అనుమానం వచ్చి ఆమె ప్రియుడి ఇంటి ఎదుట తల్లి ధర్నాకు దిగింది.
సంచలన సృష్టించిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను కాల్చి చంపిన వ్యక్తులను భద్రతా కారణాల దృష్ట్యా ఉత్తరప్రదేశ్‌లోని మరొక జైలుకు తరలించారు. నిందితులు సన్నీ సింగ్, అరుణ్ మౌర్య, లవలేష్ తోవారీ ముగ్గురిని మునుపటి నైనీ జైలు నుండి ప్రతాప్‌గఢ్ జైలుకు తరలించారు.