Canada: కెనడా భారతీయుడికి జైలు శిక్ష.. మానవ అక్రమ రవాణా కేసులో శిక్ష ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: కెనడాలో నివాసం ఉంటున్న భారతీయుడికి ఐదేళ్ల జైలు శిక్షను విధించారు. మానవ అక్రమ రవాణా కేసులో ఆయనకు శిక్షను ఖరారు చేశారు. కెనడాలోని ఒంటారియో నివాసముంటున్న భారతీయుడు సిమ్రాన్ జిత్ షల్లీ సింగ్(40) మానవ అక్రమ రవాణాకు పాల్పడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్షతోపాటు 250,000 అమెరికన్ డాలర్ల జరిమానా విధించింది అల్బనీలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు. సింగ్ మొదటగా ఆరుగురిని అక్రమ రవాణా చేయగా న్యూయార్క్ లో ఉండగా మరో ముగ్గురిని అక్రమ రవాణా చేసినట్లు అంగీకరించాడు. యూఎస్ అభ్యర్ధన మేరకు సింగ్ ను 2022 జూన్ 28న కెనడాలో అరెస్టు చేశారు. తర్వాత అమెరికా తరలించారు. ఈ ఏడాది మార్చిలో అతడిని విచారణ నిమిత్తం కెనడా నుండి అమెరికా రప్పించారు. విచారణలో మార్చి 2020 నుండి మార్చి 2021 మధ్యలో అతను అనేక మంది భారతీయులను కెనడా నుండి కార్న్ వాల్ ద్వీపం, సెయింట్ లారెన్స్ నదీ ప్రాంతంలోని అక్వెసన్సే భారత రిజర్వ్ మీదుగా అమెరికాకు అక్రమంగా రవాణా చేసినట్టు తేలింది. అతడు మానవ రవాణాకు ఎక్కువగా ఈ మార్గాన్నే ఎంచుకునేవాడని తేలింది.
Read also: Taapsee : ఆ విషయంలో హీరోయిన్స్ నే ఎందుకు తప్పుబడతారు..
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
నిందితుడు సెయింట్ లారెన్స్ నదిలో పడవల ద్వారా అమెరికాకు తరలించే వాడని అల్బనీ పోలీసులు తెలిపారు. గతంలో ఇదే నదిలో నలుగురు భారతీయులు, నలుగురు రోమానియన్ల మృతదేహాలను గుర్తించామని.. అప్పుడే ఈ ఉదంతం మొత్తం వెలుగులోకి వచ్చినట్లు అల్బనీ పోలీసులు తెలిపారు. కొంతమంది అక్రమ వలసదారులు అమెరికన్ లా ఎన్ఫోర్స్ మెంట్ వారికి సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా చూస్తే సింగ్ బాధితుల వద్ద నుండి 5000 నుండి 35000 అమెరికన్ డాలర్ల వరకు వసూలు చేసేవాడని తేలింది. ఈ నేరారోపణలన్నిటిలోనూ సింగ్ దోషిగా తేలడంతో న్యూయార్క్ అల్బనీలోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి మెయ్ ఏ.డి. ఆగోష్ఠినో నిందితుడికి మొదట ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ దీన్ని 15 ఏళ్ల వరకూ పొడిగించే ఆవకాశముందని అన్నారు. జైలు శిక్ష తోపాటు సింగ్ కు 250,000 యూఎస్ డాలర్ల జరిమానా కూడా విధించారు. జైలు శిక్ష డిసెంబర్ 28, 2023 నుండి అమల్లోకి వస్తుందని తీర్పునిచ్చారు.
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!