నకిలీ అంబులెన్స్ కేసులో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ గురువారం బారాబంకి ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో.. ముఖ్తార్ అన్సారీ కోర్టులో ఒక దరఖాస్తు ఇచ్చారు. జైల్లో తనకు స్లో పాయిజన్ ఇస్తున్నారని అన్సారీ ఈ దరఖాస్తులో ఆరోపించారు. ఇది తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. కాగా.. తనకు వైద్యం చేసేందుకు వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని అన్సారీ కోర్టును అభ్యర్థించారు.
దేశ రాజధాని ఢిల్లీలో శరణార్థులు చేసిన నిరసనలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా జైలులో ఉండాల్సి వారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు గుడ్‌న్యూస్ చెప్పింది. సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా కొంత మంది ఖైదీలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. జీవిత ఖైదు అనుభవిస్తూ అనారోగ్యం, వృద్ధాప్యం, ఇతర సమస్యలతో బాధపడుతున్న ఖైదీల శిక్షాకాలాన్ని తగ్గిస్తూ క్షమాభిక్ష ప్రసాదించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ గ్రహీత ఆర్థికవేత్త డాక్టర్ ముహమ్మద్ యూనస్‌కు న్యాయస్థానం సోమవారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. యూనస్ మద్దతుదారులు ఈ సంఘటనను "రాజకీయ ప్రేరణ"గా అభివర్ణించారు. ఇదిలా ఉంటే.. 83 ఏళ్ల ఆర్థికవేత్త ముహమ్మద్ యూనస్ తన పేదరిక వ్యతిరేక ప్రచారానికి 2006లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. ఈ ప్రచారం బంగ్లాదేశ్‌కు 1983లో స్థాపించిన గ్రామీణ బ్యాంకు ద్వారా మైక్రోక్రెడిట్‌కు నిలయంగా పేరు తెచ్చుకుంది.
ఓ హృదయవిధార ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. జైల్లో ఉన్న తల్లి కోసం జైలు బయట చిన్నారి ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ చిన్నారి కన్నీళ్లు అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.. ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. కర్నూల్‌లో మహిళా సబ్ జైలు బయట 9 ఏళ్ల బాలిక ఏడుస్తుండడాన్ని ఓ బాటసారి గమనించారు. దాన్ని వీడియో తీశాడు. ఆ చిన్నారి తన తల్లిని…
నిఠారీ వరుస హత్యల నిందితుడు మోనీందర్ సింగ్ పంధర్‌ను అలహాబాద్ హైకోర్టు అన్ని అభియోగాల నుంచి తొలగించిన కొద్ది రోజుల తర్వాత గ్రేటర్ నోయిడా జైలు నుంచి ఈరోజు విడుదలయ్యాడు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 26 వ తేదీ నుంచి వైసీపీ సామాజిక న్యాయ యాత్ర బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది అని వైసీపీ జోనల్ ఇంచార్జ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. సమ సమాజ స్దాపన కోసం సీఎం జగన్ కృషిచేస్తున్నారు..
రాజమండ్రి సెంట్రల్ జైలులోని చంద్రబాబు రిమాండ్ నేటికి 37వ రోజుకు చేరుకుంది. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు రిమాండ్ లో ఉన్న స్నేహా బ్లాక్ లో ఏసీ ఏర్పాటుకు సెంట్రల్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచీ బయటకు వస్తారని ఆశిస్తున్నాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ ఒక లాల్ బహాదూర్ శాస్త్రి, వాజ్ పేయి అయితే నేను ఇలా మాట్లాడను.. వచ్చే దశాబ్ద కాలం మనం కలిసి పనిచేయాలి అని టీడీపీకి చెపుతా.. 2009లో కోల్పోయిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను అని ఆయన పేర్కొన్నారు.