Protest : ప్రాణంగా ప్రేమించిన ప్రియుడే ఆమె పాలిట యముడిగా మారాడు. నమ్మి తనతో వెళితే చంపి నదిలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియదన్నట్టు ఆత్మహత్యగా చిత్రీకరించబోయాడు. కానీ కుమార్తె మృతి పై అనుమానం వచ్చి ఆమె ప్రియుడి ఇంటి ఎదుట తల్లి ధర్నాకు దిగింది. జార్ఖండ్ రాష్ట్రంలోని సిద్ధ్‌గోడా బాగున్‌హటు రోడ్ నెం-5లో నివాసం ఉంటున్న 21 ఏళ్ల యువతి మృతికి కారకుడైన ప్రేమికుడు వికాస్ దత్తా, అతని తండ్రిని పోలీసులు గురువారం జైలుకు పంపారు. సాయంత్రం ఐదు గంటలకు మృతురాలి సోదరుడు, స్థానిక నాయకులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఎఫ్ఐఆర్ కాపీని, అతని తండ్రిని జైలుకు పంపిన రుజువును అందించారు. అనంతరం ప్రేమికుడి ఇంటి వద్ద ధర్నాకు దిగిన బాలిక కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తొలగించి అంత్యక్రియలు నిర్వహించారు.
Read Also: Shilpa Shetty: 47 ఏళ్ళ వయస్సులో కూడా ఆ శరీర సౌష్టవమేలా.. భామా
వికాస్ తన కుమార్తెను చంపి మృతదేహాన్ని నదిలో పడేశాడని మృతురాలి తల్లి ఆరోపించింది. పోలీసులు మృతదేహం దగ్గరకు వచ్చి నిందితులపై చర్య తీసుకునేంత వరకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించమని యువతి తల్లి భీష్మించుకుని కూర్చొంది. అసలేం జరిగిందంటే.. బాధితురాలి కుమార్తె చనిపోయే ముందు, ఆమె ప్రేమికుడు వికాస్ దత్తా నది ఒడ్డున ఆమెపై దాడి చేసి మొబైల్ లాక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో బంధువులకు లభించింది. దీంతో కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి మృతదేహాన్ని నదిలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టంలో కూడా బాలిక శరీరంపై గాయాల గుర్తులు కనిపించాయి. మృతదేహం రోజంతా ఎండలో ఉండడంతో దుర్వాసన వెదజల్లింది. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ధర్నాలో కూర్చున్న మహిళను, ఆమె కొడుకును కూడా ప్రజలు శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరూ వినలేదు. కుమార్తె మృతదేహాన్ని తెల్లటి గుడ్డలో చుట్టి, తన ప్రేమికుడి ఇంటి ప్రాంగణంలో చిన్న కూతురుతో కలిసి ధర్నాకు కూర్చుంది. మృతదేహం నుంచి దుర్వాసనతోపాటు పురుగులు వచ్చాయి. చనిపోయిన అమ్మాయే ఆ ఇంటికి పెద్ద కూతురు.
Read Also: Parvati Nair : ప్యాంట్ బటన్ విప్పి.. సెగలు పుట్టిస్తోందే