ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన “సిట్” పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.. గత ప్రభుత్వ అవినీతిపై ‘సిట్’ అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటుపై ‘స్టే’ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.. హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేయగా.. ఇప్పటికే వాదనలు విన్న జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ రోజు తీర్పు ఇచ్చింది.. ఈ సందర్భంగా హైకోర్టు తప్పుగా అన్వయించుకుందని వ్యాఖ్యానించింది ధర్మాసనం. ఈ తీర్పుపై వైసీపీ మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారరు.
చంద్రబాబు సహా నేతలందరూ జైలుకు వెళ్లడం ఖాయం.. చేసినా తప్పులకు స్టే లు తెచ్చుకుంటూ ఇన్నాళ్ళూ చంద్రబాబు బతికాడు ..సుప్రీంకోర్టు తీర్పు ఒక విజయం అన్నారు మంత్రి రోజా. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన రోజా.. చంద్రబాబు పాపాలు పండాయన్నారు. చంద్రబాబు జైలు వెళ్ళి చిప్పకూడు తినే రోజులు వచ్చేశాయి.
చేసిన తప్పులకు స్టేలు తెచ్చుకుంటూ ఇన్నాళ్ళూ చంద్రబాబు బతికాడు ..సుప్రీంకోర్టు తీర్పు ఒక విజయం అన్నారు రోజా. ప్రజలు దగ్గర నుండి కోట్లు దోచుకున్నాడు. అమరావతిలో టిడిపి నేతలు పెద్ద ఎత్తున భూములు కొని ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారు. చంద్రబాబుతో సహా నేతలు అందరూ కలసి జైలుకు వెళతారు. సిట్ విచారణలో అందరూ లెక్కలు బయట వస్తాయి..లోకేష్, చంద్రబాబు ఇచ్చిన సూట్ కేసులు లెక్కపెట్టిన భువనేశ్వరి లెక్కలు బయటకు వస్తాయన్నారు. వందశాతం అందరూ జైలుకు వెళతారని రోజా అన్నారు.
Read Also: Doctors On Strike: నిరవధిక సమ్మెకు దిగిన ప్రభుత్వ వైద్యులు.. కారణమేంటంటే?