అగ్ర రాజ్యం అమెరికా హెచ్చరించినట్లుగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేయడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు.
Israel- Iran: హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణంతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఆగ్రహంతో ఉంది. బెంజమిన్ నెతన్యాహు సర్కార్ పై ప్రతీకార చర్యలు తీసుకోవాలని ఛాందసవాదులు డిమాండ్ చేస్తున్నారు.
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్- లెబనాన్- ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.
Iran: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించడంతో గట్టి షాక్ తగిలింది. దీంతో హెజ్బొల్లా మరింత తీవ్రంగా ఇజ్రాయెల్‌పై విరుచుకుపడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇరాన్ భద్రతా మండలి అత్యవసర భేటీకి పిలుపునిచ్చింది. హెజ్ బొల్లాకు మద్దతిస్తున్నట్లు ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది.
Israel: ఇజ్రాయిల్ దూకుడుగా వ్యవహరిస్తోంది. తమపై దాడి చేసే వారిని వదిలేది లేదని చాలా సందర్భాల్లో ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ఇటీవల ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, శుక్రవారం జరిగిన ఇజ్రాయిల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యాడు. అతడి మరణంతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.
Iran: లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లాని ఇజ్రాయిల్ హతం చేసింది. శుక్రవారం బీరూట్‌పై జరిగిన దాడుల్లో అతను చనిపోయాడు. ఈ ఘటన మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల్ని పెంచింది.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడెట్ డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతోందని ఆయన ప్రచార బృందం వెల్లడించింది.
Iran: ఇజ్రాయిల్, లెబనాన్‌లో హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. వరసగా దాడులు నిర్వహిస్తోంది. గత వారం పేజర్ల దాడి జరిగిన తర్వాత లెబనాన్‌పై దాడుల్ని విస్తృతం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ హిజ్బుల్లాకు మద్దతుగా నిలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ.. హిజ్బుల్లా కమాండర్లను హతమార్చడం హిజ్బుల్లాని మోకాళ్లపైకి తీసుకురాదని అన్నారు. హిజ్బుల్లా సంస్థాగత బలం, మానవ వనరులు చాలా బలంగా ఉన్నాయని, ఒక సీనియర్ కమాండర్‌ని చంపడం వల్ల అది నష్టపోదని ఖమేనీ చెప్పారు.
ఆదివారం ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది మృతి చెందారు. అంతేకాకుండా.. 20 మంది గాయపడ్డారు. గత కొన్నేళ్లుగా దేశంలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఇదొకటి అని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఇరాన్‌లోని దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్‌లో ఈ పేలుడు సంభవించింది.
Blast : మిడిల్ ఈస్ట్ దేశం ఇరాన్‌లోని బొగ్గు గనిలో శనివారం రాత్రి 9 గంటలకు ప్రమాదం జరిగింది. ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ లీకేజీ కారణంగా పేలుడు సంభవించింది.