Israel-Iran: మా జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయి.. ఇరాన్ కమాండర్ వార్నింగ్
- మా జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయి
- ఇజ్రాయెల్‌కు ఇరాన్ కమాండర్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇజ్రాయెల్‌కు ఇరాన్ కమాండర్ హసన్ సలామీ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన జనరల్ అబ్బాస్ నీలోఫర్సన్ అంత్యక్రియల్లో పాల్గొన్న హసన్ సలామీ ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి ఈ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా సరఫరా చేసే క్షిపణి వ్యవస్థపై కూడా విమర్శలు గుప్పించారు. ఈ వ్యవస్థలను ఇజ్రాయెల్ విశ్వసించవద్దని కోరారు. ముస్లిం దేశాలను ఎవరూ ఏం చేయలేరన్నారు. ఒకవేళ దాడులు చేస్తే సురక్షితంగా ఉండలేరని హెచ్చరించారు. ఒకవేళ పొరపాటు చేసి ఇరాన్ లక్ష్యాలపై దాడి చేస్తే.. తిరిగి బాధపడేలా దాడులు చేస్తామని హసన్ సలామీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: KTR: తెలంగాణ భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులతో ముగిసిన సమావేశం.. కేటీఆర్ కీలక నిర్ణయం
Also Read
ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ 180 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. కొన్నింటిని గగనతలంలోనే ఇజ్రాయెల్ పేల్చేసింది. మరికొన్ని ఇజ్రాయెల్ భూభాగంలో పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఐడీఎఫ్ దళాలు తెలిపాయి. అయితే ఈ దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ఇక అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా.. ఇరాన్ చమురు, అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయొచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అదునుకోసం కనిపెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులు చేయొచ్చన్న తరుణంలో ఇరాన్ కమాండర్ హసన్ సలామీ హెచ్చరికలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Allu Arjun: అల్లు అర్జున్ ఇంట్లో ఎన్టీఆర్ ఫోటో… వైరల్
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!