Israeli Air Strikes: ఇజ్రాయెల్ దళాలు ఉత్తర గాజాలో తమ దాడిని మరింత విస్తృతం చేసింది. ఈ సందర్భంగా ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడి సెంట్రల్ గాజా స్ట్రిప్ నగరమైన డీర్ అల్-బలాహ్‌లోని అల్-అక్సా హాస్పిటల్‌లోని పాలస్తీనియన్ల గుడారాలపై ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేసింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఇక్కడ మిలియన్ల మంది ప్రజలు ఆశ్రయం పొందారని స్థానిక వైద్యులు చెప్పారు. గుడారాలు తగలబడిపోతుండటంతో కొంత మంది పాలస్తీనియన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారని వెల్లడించారు.
Read Also: Hyderabad Mayor: హైదరాబాద్ మేయర్ పై కేసు నమోదు.. కారణం ఇదే..
కాగా, హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ మిలిటరీ కమాండ్ సెంటర్ నుంచి పని చేస్తున్నారు. ఆసుపత్రుల లాంటి పౌర సౌకర్యాలను హమాస్ సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది. ఆసుపత్రులు వారి రోగులను ఖాళీ చేస్తున్నారు.. అవసరమైన వైద్య సామాగ్రి అయిపోతోంది.. ఆస్పత్రుల్లో తలదాచుకున్న హమాస్ నేతలపై నెతన్యాహు సైన్యం దాడులు కొనసాగిస్తుంది. అయితే, గాజాలోని బీట్ హనౌన్, జబాలియా, బీట్ లాహియా అనే మూడు పట్టణాలను విడిచి పెట్టడానికి ఇష్టపడే కుటుంబాలకు అనుమతి లేకుండా రెండు ప్రాంతాల మధ్య ప్రవేశాన్ని నిరోధించాయని నివాసితులు ఆరోపిస్తున్నారు.
Read Also: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ హత్యకు మూడో ప్రయత్నం.? వ్యక్తి అరెస్ట్
ఇక, ఉత్తర గాజాలో తొమ్మిది రోజుల పాటు ఇజ్రాయెల్‌కి చెందిన బిగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో హమాస్ ఆధ్వర్యంలో నడిచే గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయంపై జరిగిన దాడుల్లో దాదాపు 300 మంది పాలస్తీనియన్లు మరణించారు. అలాగే, ఆదివారం సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని నుసిరత్ క్యాంపులో నిరాశ్రయులైన కుటుంబాలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ ట్యాంక్ షెల్లింగ్ జరిపిన దాడుల్లో సుమారు 22 మంది చనిపోగా, మరో 80 మంది గాయపడ్డారని వైద్యులు ప్రకటించారు.