UK vs Russia: గత రెండేళ్లుగా రష్యా- ఉక్రెయిన్ల యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పలు సంచలన విషయాలు తెలిపింది. ఉక్రెయిన్‌కు సపోర్టుగా నిలిచిన బ్రిటన్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు రష్యా ప్రయత్నిస్తుందని ఎమ్ఐ5 ఏజెన్సీ ఆరోపించింది.
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడైనా భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉంది. అనేక రంగాల్లో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు విరామం లేదు. అయితే అమెరికా, అరబ్ దేశాలు కాల్పుల విరమణకు సంబంధించి ఇరాన్‌తో చర్చలు ప్రారంభించాయి. ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం, మధ్యప్రాచ్యంలోని అన్ని రంగాలలో ఏకకాలంలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి అమెరికా, అరబ్ దేశాలు ఇరాన్‌తో బ్యాక్‌డోర్ చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది.
Iran Israel War: ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మధ్య కొనసాగుతున్న వివాదం ప్రమాదకర రూపం దాల్చింది. ఈ క్రమంలో నిన్న హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై 130 క్షిపణులను ప్రయోగించింది. ప్రతీకారంగా, IDF వేగవంతమైన దాడిని ప్రారంభించింది. కేవలం ఒక గంట పాటు 100 యుద్ధ విమానాలతో 120 సైట్ లను లక్ష్యంగా చేసుకుంది. దాడికి సంబంధించి, IDF ప్రతినిధి లెబనాన్‌లో నివసిస్తున్న ప్రజలకు తదుపరి నోటీసు వచ్చే వరకు బీచ్‌లో లేదా పడవల్లో ఉండకూడదని హెచ్చరిక జారీ చేశారు.…
Iran Nuclear Tests: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ఇరాన్ మరింత పెంచుతుంది. అందులో భాగంగా తాజాగా అణు పరీక్షలు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 5వ తేదీన శనివారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగాల్లో దాదాపుగా ఒకే టైంలో సంభవించిన భూకంపం ఈ అనుమానాలకు దారి తీసింది.
Iran Israel War: హసన్ నస్రల్లా మరణం తర్వాత పెరిగిన ఉద్రిక్తత మధ్య, హిజ్బుల్లా సోమవారం ఇజ్రాయెల్‌పై పెద్ద దాడిని ప్రారంభించింది. హిజ్బుల్లా ఇప్పటివరకు జరిపిన రెండో అతిపెద్ద దాడిగా ఇది పేర్కొంది. సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ దేశ మూడవ అతిపెద్ద నగరమైన హైఫాపై హిజ్బుల్లా రాకెట్లను ప్రయోగించింది. గాజా యుద్ధం మొదటి వార్షికోత్సవం సందర్భంగా.. ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లో భూదాడులను విస్తరించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా ‘ఫాడీ…
Israeli PM: హమాస్ దాడి ప్రారంభించి అక్టోబర్ 7తో సంవత్సరం అయిన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. మా సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉందన్నారు. పాలస్తీనా హమాస్ మిలిటెంట్లతో పాటు లెబనాన్ లోని హిజ్బుల్లాతో పోరాడి ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్నంది అన్నారు.
Iran- Israel Conflict: ఇరాన్‌పై దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమాన్ నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలతో ఇరాన్ అలర్ట్ అయింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం (అక్టోబర్7) ఉదయం 6 గంటల దాకా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల నుంచి విమానాల రాకపోకలను రద్దు చేసింది.
Israel Hamas War: 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన రోజు అంటే నేటికి సరిగ్గా ఏడాది క్రితం. గతంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న సెటిల్మెంట్ ప్రాంతాలపై హమాస్ రాకెట్లతో పెద్ద ఎత్తున విరుచుకుపడింది.
Iran: ఇరాన్‌కి చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కార్ఫ్స్(IRGC) ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఎస్మాయిల్ ఖానీ శుక్రవారం బీరుట్లో కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. శుక్రవారం బీరూట్‌పై జరిగిన ఇజ్రాయిల్ వైమానిక దాడుల తర్వాత నుంచి మిస్సయినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఇరాన్ మీడియా ఇతడి ఆచూకీ గురించి మౌనంగా ఉండగా.. టర్కీష్, ఇజ్రాయిల్ మీడియాలు మాత్రం ఖానీ చనిపోయి ఉండొచ్చని పేర్కొన్నాయి.
Iran Israel War: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు చేసింది. అందిన సమాచారం మేరకు., ఆదివారం తెల్లవారుజామున గాజా మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 18 మంది మరణించారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ దాడి జరిగింది. పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఒక సంవత్సరం పూర్తి చేయబోతున్న సమయంలో సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని డీర్ అల్-బలాహ్లోని అల్-అక్సా…