Israel-Iran Conflict: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇరాన్‌పై ఇజ్రాయిల్ ప్రతీకార దాడి..?
- అమెరికా ఎన్నికల ముందే ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి..?
- అంచనా వేస్తున్న అమెరికా అధికారులు..
- యూఎస్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran Conflict: నవంబర్ 5న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కన్నా ముందే ఇరాన్‌పై ప్రతీకార దాడి చేయాలని ఇజ్రాయిల్ భావిస్తున్నట్లు అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయిల్‌పై ఇరాన్ 200 బాలిస్టిక్ క్షిపణులను ఫైర్ చేసింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్య తర్వాత ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడికి పాల్పడినంది. ఇజ్రాయిల్ లెబనాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా విరుచుకుపడుతోంది. ఈ సందర్భంలోనే నస్రల్లాని బీరూట్‌లో వైమానికదాడి చేసి చంపేసింది. కీలకమైన హిజ్బుల్లా నాయకులను కూడా ఇజ్రాయిల్ ఎలిమినేట్ చేసింది.
తమపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇజ్రాయిల్ అనుకుంటోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు, అణు కేంద్రాలను టార్గెట్ చేయవచ్చనే వాదన వినిపిస్తోంది. నిజానికి ఇజ్రాయిల్ ఎన్నికలతో ఈ అంశం ముడిపడిలేకున్నా.. అమెరికా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో.. ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహూకు తెలుసు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లో అశాంతి, డెమోక్రాట్ల తరుపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలా హారిస్‌కి ప్రతిబంధకంగా మారింది. గాజాలో యుద్ధాన్ని ఆపలేకపోయారని బిడెన్ పరిపాలనపై విమర్శలు వస్తున్నాయి. పరిస్థితిని సరిగా హ్యాండిల్ చేయలేదని రిపబ్లికన్లు విమర్శి్స్తున్నారు. మరికొందురు మాత్రం ఇది మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కి సాయం కావచ్చని భావిస్తున్నారు.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
Read Also: Minister Atchannaidu: కేరళ తరహాలో తీర ప్రాంత అభివృద్ధి.. వేట నిషేధ భృతి అమలుకు చర్యలు
మరోవైపు గాజాలో మానవతా పరిస్థితిని మెరుగుపరచాలని ఇజ్రాయిల్‌కి బిడెన్ అడ్మినిస్ట్రేషన్ పిలుపునిచ్చింది. గాజాకు సాయాన్ని పెంచడంతో ఇజ్రాయిల్ విఫలమైంతే ఇది నిరంతర సైనిక సహాయంపై ప్రభావాన్ని చూపిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఒక లేఖలో పేర్కొన్నారు. అయితే, వీటిపై జో బిడెన్ లేదా కమలా హారిస్ సంతకాలు లేవు. ఇజ్రాయిల్, ఇరాన్‌పై దాడి చేసే సమయం ముఖ్యంగా అమెరికాలోని అరబ్ కమ్యూనిటీ ఓట్లపై ప్రభావం చూపిస్తుందని, ఈ కమ్యూనిటీకి కేంద్రంగా ఉన్న మిచిగాన్ వంటి స్వింగ్ స్టేట్‌లో ప్రభావం ఉంటుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, ఇజ్రాయిల్ యుద్ధం సెన్సిటివ్ టాపిక్‌గా మారి రాష్ట్రంలో హారిస్ ప్రచారం చేస్తున్నారు. ఇరాన్ అణు, చమురు క్షేత్రాలపై దాడి చేయవద్దని జో బిడెన్, ఇజ్రాయిల్‌ని కోరారు. అయితే, నెతన్యాహూ మాత్రం ఇజ్రాయిల్ దాని జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందని చెప్పారు. మరికొందరు యూఎస్ నిపుణులు మాత్రం.. నెతన్యాహూ చర్యలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపవని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!