Iran: మిడిల్ ఈస్ట్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలోనే ఇరాన్ శనివారం మిలిటరీ పెరేడ్లో తన కొత్త బాలిస్టిక్ మిసైల్స్, అప్ గ్రేడ్ చేసిన వన్-వే అటాక్ డ్రోన్లు ఆవిష్కరించింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు డ్రోన్లు, క్షిపణులను సరఫరా చేసినట్లు ఇరాన్ వెస్ట్రన్ దేశాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటోంది.
India On Iran: భారతీయ ముస్లింలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Bus Accident: ఒక విషాద సంఘటనలో, ఇరాన్లో పాకిస్థానీ యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఫలితంగా 35 మంది మరణించారు. ఇంకా 18 మంది గాయపడ్డారు. ఇరాన్ ట్రాఫిక్ పోలీసుల ప్రాథమిక పరిశోధనల ప్రకారం.. యాజ్ద్ ప్రావిన్స్‌లో మంగళవారం రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకింగ్ సిస్టమ్ లో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 53 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ప్రధానంగా సింధ్ లోని లర్కానా, ఘోట్కీ…
ఇజ్రాయెల్‌పై యుద్ధం విషయంలో ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్ విషయంలో వెనక్కి తగ్గితే.. దైవాగ్రహం తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. ప్రతీకారం విషయంలో వెనక్కి తగ్గినా.. రాజీపడినా దైవాగ్రహానికి గురికాక తప్పదని ఇరానీయులకు హెచ్చరికలు జారీ చేశారు.
Iran-Israel Tensions: ఇరాన్ లేదా దాని ప్రాక్సీలు రానున్న రోజుల్లో ఇజ్రాయిల్‌పై దాడికి దిగే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్‌ని ఉటంకిస్తూ వైట్‌హౌజ్ వర్గాలు హెచ్చరించాయి. ‘‘ఈ వారంలోనే దాడి జరిగే అవకాశం ఉంది’’ అని వైట్‌హౌజ్ ప్రతినిధి జాన్ ఎఫ్ కిర్బీ అన్నారు.
China: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ గడ్డ పైనే హత్యకు గురికావడంతో ఆ దేశం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకారం కోసం వచ్చిన సమయంలో రాజధాని టెహ్రాన్‌లో హనియే హత్యకు గురయ్యాడు.
Donald Trump : ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి స్థాయిలో ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇంతలో ఆయన అంతర్గత సందేశాలు హ్యాక్ చేయబడి ఇరాన్‌పై ఈ ఆరోపణ చేసినట్లు వార్తలు వచ్చాయి.
Iran Israel War : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ప్రతీకార దాడికి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతపై ప్రపంచం ఒక కన్ను వేసి ఉంచింది.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్-లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు కమ్ముకున్నాయి. ఇటీవల హమాస్ అగ్ర నేత హనియా హత్య తర్వాత ఈ పరిస్థితులు మరింత తీవ్రం అయ్యాయి.
ఇటీవల ఇజ్రాయిల్ వైమానిక దాడిలో లెబనాన్ రాజధాని బీరూట్‌లో హిజ్బుల్లా సీనియర్ కమాండర్ ఫువాద్ షుక్ర్ని హతమార్చింది. అయితే, ఇజ్రాయిల్ లెబానాన్ నుంచి వస్తున్న శత్రువుల డ్రోన్లు అడ్డగించింది.