Drone Targets Israel PM: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిని టార్గెట్ చేసిన లెబనాన్ డ్రోన్..
- ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిని టార్గెట్ చేసిన లెబనాన్..
- నెతన్యాహు లక్ష్యంగా డ్రోన్ దాడి చేసేందుకు ప్లాన్..
- ఇజ్రాయెల్ ప్రధాని ఇంటి సమీపంలో ఓ భవనాన్ని ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో పేలిన డ్రోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drone Targets Israel PM: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లక్ష్యంగా ఈ క్రమంలో హెజ్‌బొల్లా కేంద్రమైన లెబనాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్ ఈరోజు (శనివారం) దక్షిణ హైఫాలోని సిజేరియాలోని నెతన్యాహు ప్రైవేట్ నివాసం సమీపంలో పేలిపోయిందని రాయిటర్స్ నివేదించింది. గాజాలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ చంపేసిన రెండు రోజుల తర్వాత ఈ దాడి జరిగడంతో తీవ్ర కలకలం రేపుతుంది. అయితే, నెతన్యాహు, అతని భార్య అక్కడ లేరని ప్రధాని ప్రతినిధి చెప్పారు. ఇక, లెబనాన్ నుంచి ప్రయోగించిన మరో రెండు డ్రోన్‌లు టెల్ అవీవ్ ప్రాంతంలో వచ్చిన తర్వాత సైరన్‌లు మోగడంతో గాల్లోనే ఇజ్రాయెల్ డిఫెన్స్ సైనికులు కూల్చివేశారు. అయితే మూడోది సిజేరియాలోని ఓ భవనాన్ని ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ డ్రోన్ ఢీ కొట్టడంతో భవనంలో కొంత భాగం దెబ్బతిన్నదని సౌదీ అవుట్‌లెట్ అల్-హదత్ వెల్లడించింది. అలాగే, సిజేరియాలోని భవనాన్ని ఢీకొనడానికి ముందు డ్రోన్ లెబనాన్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో నుంచి వచ్చిందని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది.
Read Also: JR. NTR : కాస్త తగ్గిన దేవర.. ఇప్పటికి ఎన్ని కోట్లు లాభమంటే..?
Also Read
అయితే, ఇక, ఇజ్రాయెల్‌పై హమాస్ గత ఏడాది అక్టోబరు 7న దాడికి ప్లాన్ చేసిన ప్రధాన నిందితుడు యాహ్యా సిన్వార్ కోసం ఒక సంవత్సరం పాటు గాలించిన తర్వాత ఈ నెల 16న ఇజ్రాయెల్ దళాలచే చంపబడ్డాడు. ఆ తర్వాతే ప్రధాని నెతన్యాహు ఇంటీ సమీపంలో ఈ డ్రోన్ దాడి జరిగింది. ఇక, హమాస్- ఇజ్రాయెల్ మధ్య తక్షణ కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ సమాజం పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోరాటం కొనసాగిస్తామని గాజాలోని మిలిటెంట్ గ్రూప్ ప్రతిజ్ఞ చేసింది. సిన్వార్ యొక్క డిప్యూటీ ఖలీల్ అల్-హయ్యా, హమాస్ నాయకుడు మరణించినప్పటికీ, గతంలో కంటే బలంగా ముందుకు వెళ్తామని వెల్లడించారు. నెతన్యాహును అంతం చేయడమే మా ప్రధాన లక్ష్యం అని హమాస్ వెల్లడించింది. ఈరోజు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ.. సిన్వార్ మరణం బాధకరం అయినప్పటికి.. హమాస్ ఇంకా ఉనికిలోనే ఉందన్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?