ఇరాన్ జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇజ్రాయెల్‌కు ఇరాన్ కమాండర్ హసన్ సలామీ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన జనరల్ అబ్బాస్ నీలోఫర్సన్ అంత్యక్రియల్లో పాల్గొన్న హసన్ సలామీ ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి ఈ హెచ్చరికలు జారీ చేశారు.
Benjamin Netanyahu: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా అణు, చమురు స్థావరాలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.
US- Israel: ఇటీవలే ఇజ్రాయెల్‌పై ఇరాన్ వరుసగా మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో అమెరికా నేరుగా బరిలోకి దిగింది. ఇజ్రాయెల్‌కు అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ‘టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్’ను అందిస్తామని ఆదివారం నాడు వెల్లడించింది.
Israeli Air Strikes: ఇజ్రాయెల్ దళాలు ఉత్తర గాజాలో తమ దాడిని మరింత విస్తృతం చేసింది. ఈ సందర్భంగా ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడి సెంట్రల్ గాజా స్ట్రిప్ నగరమైన డీర్ అల్-బలాహ్లోని అల్-అక్సా హాస్పిటల్‌లోని పాలస్తీనియన్ల గుడారాలపై ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేసింది.
Iran Iraq War: లెబనీస్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై భారీ డ్రోన్ దాడి చేసింది. బిన్యామీనా సమీపంలోని సైనిక స్థావరంపై డ్రోన్ ద్వారా ఈ దాడి జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ దాడిలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించగా, 60 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఈ మేరకు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మాట్లాడుతూ.. హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ యుఎవితో ఆర్మీ బేస్‌పై…
Hamas: హమాస్ అక్టోబర్ 07, 2023 దాడికి ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దాడుల కోసం హమాస్ మిలిటరీ, పొలిటికల్ నాయకుడు దాదాపుగా రెండేళ్ల పాటు వరసగా సమావేశాలు నిర్వహించారు. గతేడాది అక్టోబర్ 07 నాటి దాడిలో హమాస్, దక్షిణ ఇజ్రాయిల్లోకి ప్రవేశించి 1200 మందిని చంపింది. 251 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ హమాస్‌పై విరుచుకుపడుతోంది. గాజాలో దాడుల్లో ఇప్పటి వరకు 40…
Iran: ఇజ్రాయిల్-ఇరాన్ పరిణామాలు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణమువుతోంది. ఇజ్రాయిల్ ఇరాన్ ప్రాక్సీలైన హిజ్బుల్లా, హమాస్‌లను హతం చేస్తోంది. ఇప్పటికే హిజ్బుల్లా కీలక నాయకుడు హసన్ నస్రల్లాని చంపేసింది, ఆ తర్వాత హిజ్బుల్లా చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న హసీమ్ సఫీద్దీన్‌ని కూడా చంపేసింది. హిజ్బుల్లా ప్రధాన కమాండర్లని చంపేసింది. ఇదిలా ఉంటే, హజ్బుల్లాపై దాడికి ప్రతిస్పందనగా, ఇటీవల ఇరాన్ 200కి పైగా బాలిస్టిక్ మిస్సైళ్లను ఇజ్రాయిల్ పైకి ప్రయోగింది.
Cyber Attack In Iran: పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణంతో ప్రపంచమంతా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఈ సమయంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్లో ఈరోజు (శనివారం) భారీ స్థాయిలో సైబర్ దాడులు జరిగినట్లు తేలింది. దాంతో సర్కార్ లోని మూడు బ్రాంచ్‌ల (న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖలు) సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది.
America vs Iran: ఇరాన్- ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో యూఎస్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రో కెమికల్ రంగాలపై తన ఆంక్షలను విస్తరించింది అమెరికా.
Isreal- Gaza Conflict: పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను క్రమంగా పెంచుతుంది. తాజాగా, గాజాలోని ఓ శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో సుమారు 27 మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు.