ఇరాన్‌పై దాడి విషయంలో అమెరికా వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వచ్చాయి. సౌదీ అరేబియా, ఖతార్ మధ్యవర్తిత్వంతో ట్రంప్ వెనకడుగు వేసినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు చక్కర్లు కొట్టాయి.
ఇరాన్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్దిరోజులుగా ఇరాన్ అట్టుడుకుతోంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలతో రక్తసిక్తం అవుతోంది.
గత కొద్దిరోజులుగా ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటి వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇరాన్‌ను మరోసారి ట్రంప్ హెచ్చరించారు. నిరసనకారులను ఉరితీస్తే అమెరికా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు.
ఇరాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత దారుణంగా నరమేధం జరిగినట్లుగా అంతర్జాతీయ కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే నిరసనకారులకు ఏదైనా జరిగితే రంగంలోకి దిగుతామని ట్రంప్ హెచ్చరించారు.
ఇరాన్లో నరమేధం జరిగినట్లుగా అంతర్జాతీయ కథనాల్లో వెలువడుతున్నాయి. టెహ్రాన్‌లో ఎటుచూసినా నగర వీధుల్లో శవాలు పడి ఉన్నట్లుగా కథనాలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా వేలాది మంది గాయాలు పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం.
ఇరాన్లో పరిస్థితులు పూర్తిగా చేదాటిపోయాయి. నగరాలు రక్తసిక్తంగా మారాయి. వందలాది మంది నిరసనకారులు శవాలు రోడ్లపై పడి ఉన్నాయి. దాదాపు వందలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు ఇంటర్నెట్ బంద్ అయింది. నగరాల్లో కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఇక టెహ్రాన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హింస తీవ్ర రూపం దాల్చింది. నిరసనకారులు వాహనాలు, ఆస్తులు తగలబెట్టారు.
ఇరాన్లో పరిస్థితులు చేదాటిపోతున్నాయి. ఆర్థిక సంక్షోభాన్ని నిరసిస్తూ గత రెండు వారాల నుంచి ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
ఊహించినట్టుగానే ఇరాన్ మంటల్లో తగలబడుతోంది. గత కొద్దిరోజులగా జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు తాజాగా తీవ్ర రూపం దాల్చాయి. పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు రోడ్లపైకి రావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.