Benjamin Netanyahu: ఇరాన్ అణు, చమురు స్థావరాలపై దాడి చేయబోం..
- ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు..
- ఇరాన్ అణు.. చమురు స్థావరాలపై దాడి చేయబోమని వెల్లడించిన నెతన్యాహూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Benjamin Netanyahu: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా అణు, చమురు స్థావరాలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు నెతన్యాహు చెప్పినట్లు యూఎస్ కు చెందిన పలు మీడియాల్లో కథనాలు వెల్లడించాయి. కాగా, ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆ టైంలో ఇరువురు నేతలు ఇరాన్‌పై ప్రతీకార దాడులకు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు అమెరికాకు చెందిన ఓ అధికారి చెప్పుకొచ్చారు. ఇరాన్ చమురు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తే ఇంధన ధరలు పెరిగిపోతాయని పలువురు విశ్లేషకులు తెలిపినట్లు సమాచారం. ఇది అమెరికా ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.. కావున ఇజ్రాయెల్ ప్రత్యామ్నాయం ఆలోచించాలని నెతన్యాహుకు జో బైడెన్ సూచించారు. ఆయన సూచనలతో ఇరాన్ చమురు స్థావరాలపై దాడులను ఇజ్రాయెల్ విరమించుకున్నట్లు సమాచారం.
Read Also: Group-1 Prelims: గ్రూప్-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఈనెల 21న పరీక్షలపై..
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
అయితే, తాము అమెరికన్ ప్రభుత్వ మాటలను వింటాం.. కానీ, ఇజ్రాయెల్ దళాల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని మంత్రి కార్యాలయం వెల్లడించింది. నెతన్యాహుకు యూఎస్ విజ్ఞప్తులు ఇజ్రాయెల్‌లోని ప్రజల డిమాండ్‌తో సమానమని ఆ దేశ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ తెలిపారు. అలాగే, అమెరికా ఆయుధాలతోనే ఇజ్రాయెల్ పోరాడుతుందని వెల్లడించారు. అయితే, ఈ అంశాలపై వైట్‌హౌస్ స్పందించలేదు.
Read Also: CSIR UGC NET Result 2024: NET జూన్ పరీక్ష ఫలితాల విడుదల.. ఫలితాలు చెక్ చేసుకున్నారా?
ఇక, ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణలతో దాడి చేసింది. దాదాపు 180 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని బెంజమిన్ నెతాన్యహు ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే ఇరాన్‌కు చెందిన అణు, చమురు స్థావరాలను ధ్వంసం చేసేందుకు చర్చలు చేసినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. కానీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇరాన్ అణు స్థావరాలపై కాకుండా ప్రత్యమ్నాయంగా దాడి చేయాలని బహిరంగంగానే ఇజ్రాయెల్‌కు సూచనలను చేయడంతో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గింది.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!