Kim Jong un: ఆత్మాహుతి దాడి డ్రోన్‌లను భారీగా ఉత్పత్తి చేయాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ మీడియా వెల్లడించింది. దీనికి ఒక రోజు ముందు అతను ఈ ఆయుధ వ్యవస్థ పరీక్షను వీక్షించాడు. ఉత్తరకొరియా మానవరహిత ఏరియల్ టెక్నాలజీ కాంప్లెక్స్ (UATC) తయారు చేసిన భూమి, సముద్ర లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించిన డ్రోన్‌ల పరీక్షలను కిమ్ జోంగ్ ఉన్ వీక్షించారు. ఇందుకు సంబంధించి కొరియన్ సెంట్రల్…
Doug Collins: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన జట్టును ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి మాజీ జార్జియా కాంగ్రెస్ సభ్యుడు డగ్ కాలిన్స్ ని తన మంత్రి వర్గంలో చేర్చుకున్నాడు. సమాచారం ప్రకారం, అతను తదుపరి అమెరికా వెటరన్స్ అఫైర్స్ (VA) కార్యదర్శి పదవికి నామినేట్ అయ్యారు. గురువారం ఒక ప్రకటనలో.. చురుకైన సైనిక సిబ్బంది, అనుభవజ్ఞులు, సైనిక కుటుంబాల కోసం వాదించే కాలిన్స్ సామర్థ్యంపై ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు.…
లెబనాన్ రాజధాని బీరుట్ సమీపంలోని ఓ గ్రామంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడి చేసింది. ఈ దాడిలో 7 మంది చిన్నారులు సహా 23 మంది మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హిజ్బుల్లా మధ్య భారీ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) లెబనాన్ లోపల హిజ్బుల్లా లక్ష్యాలపై వైమానిక దాడులు చేస్తోంది.