*నేడు ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ ముఖ్యనేతలతో భేటీ కానున్న సీఎం రేవంత్.
*నేడు ముంబైలో సీఎం రేవంత్‌కు కౌంటర్‌గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్‌మీట్.. రెండ్రోజుల క్రితం ముంబైలో ప్రెస్‌మీట్ పెట్టిన సీఎం రేవంత్.
*అమరావతి: ఇవాళ ఉదయ 10 గంటలకు బడ్జెట్‌పై ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమం.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఎమ్మెల్యేలకు అవగాహన.. కొత్త ఎమ్మెల్యేలకు బడ్జెట్‌పై అవగాహన, అసెంబ్లీ కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్న స్పీకర్, ఇతర సీనియర్ నేతలు.. అనంతరం మధ్యాహ్నం ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం.. అసెంబ్లీ సమావేశాలు, వైసీపీ ఎజెండా, ఇతర అంశాలపై చర్చ.
*అమరావతి: నేడు కూటమి శాసనసభాపక్ష సమావేశం.. మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానున్న కూటమి నేతలు.. ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లను ఖరారు చేసే అవకాశం.
*విజయవాడ: నేటితో ముగియనున్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పోలీస్ కస్టడీ.. ముంబై నటి జిత్వానీ కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న కుక్కల విద్యా సాగర్.. 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి.. నేడు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో విద్యాసాగర్‌ను హాజరు పరచనున్న పోలీసులు
*తిరుమల: ఒక కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 06 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,917 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,161 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 4.82 కోట్లు
*రాజన్నసిరిసిల్ల జిల్లా: నేడు వేములవాడ రాజన్నను దర్శించుకోనున్న మాజీ మంత్రి హరీష్ రావు.. అనంతరం చల్మెడ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించనున్న హరీష్ రావు
*ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన నటి కస్తూరి.. మధురై కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్.. ఈ రోజు విచారణకు రానున్న కస్తూరి బెయిల్ పిటిషన్.. బహిరంగ క్షమాపణలు చెప్పిన తనపై ఉద్దేశపూర్వకంగా కేసులు వేశారన్న కస్తూరి.. రెండ్రోజులుగా పరారీలో నటి కస్తూరి.. ఇంటికి తాళం వేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్న కస్తూరి.. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న కస్తూరి.. కస్తూరిపై చెన్నై, మధురై సహా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు.