* నేడు బ్రెజిల్ లో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ
* ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. నేటి ఉదయం 8 గంటల నుంచి జీఆర్‌ఏపీ నాలుగో దశ ఆంక్షలు.
* పెరుగుతోన్న వాయు కాలుష్యంతో అలర్ట్ అయిన ఢిల్లీ సర్కార్.. నేటి నుంచి ఢిల్లీలో 1 నుంచి 11వ తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆప్ సర్కార్ ఆదేశాలు
* హైదరాబాద్: ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం.. నేడు గచ్చిబౌలి స్టేడియంలో ఇండియా వర్సెస్ మలేషియా మ్యాచ్.. ఫుట్‌బాల్ టోర్నీకి ఏర్పాట్లు పూర్తి చేసిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ.. తొలిసారి హైదరాబాద్ వేదికగా ఫిఫా ఫ్రెండ్లీ టోర్నమెంట్
* తెలంగాణ: నేడు లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ పర్యటన.. లగచర్ల కేసులో అరెస్టై జైలులో ఉన్న 16 మంఇని కలవనున్న జాతీయ ఎస్టీ కమిషన్
* నేడు సంగారెడ్డి జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటన.. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న పీసీసీ చీఫ్.. సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షతన సమావేశం.. సమావేశంలో పాల్గొననున్న మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ
* నేడు సంగారెడ్డి సెంట్రల్ జైలుకి రానున్న బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. లగచర్ల కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న 16 మందితో ములాఖత్ కానున్న బీజేపీ నేతలు
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కార్తిక మాస సోమవారం సందర్భంగా పవిత్ర గోదావరి నదిలో అధిక సంఖ్యలో స్నానమాచరిస్తున్న భక్తులు. శివాలయాలలో అభిషేకాలు నిర్వహిస్తూ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.
* తిరుమల: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం..
* తిరుమల: ఇవాళ ఆన్ లైన్ లో ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల.. ఇవాళ లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ.. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు రిజిష్ర్టేన్.. ఎల్లుండి మధ్యహ్నం 12 గంటలకు లక్కి డిఫ్ విధానంలో భక్తులుకు ఆర్జిత సేవా టిక్కెట్లు కేటాయింపు..
* నేడు కడపకు రానున్న హీరో రామ్ చరణ్… పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న రామ్ చరణ్… హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు రాక… పెద్ద దర్గాలో నేడు జరగనున్న ముషాయిరాలో ముఖ్యఅతిథిగా పాల్గొనున్న రామ్ చరణ్
* విశాఖ: నేడు GCC చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్న మాజీ మంత్రి కిడారి శ్రవణ్…..
* నంద్యాల: నేడు శ్రీశైలంలో కార్తీకమాసం మూడోవ సోమవారం సందర్భంగా సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి
* శ్రీ సత్యసాయి : పెనుకొండలో జరిగే కనకదాసు జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న మంత్రి సవిత.
* శ్రీ సత్యసాయి : ధర్మవరం పట్టణంలో కార్తీకమాసం మూడోవ సోమవారం సందర్భంగా శివాలయంలో పోటెత్తిన జనం. ఆలయం వద్ద మధ్యాహ్నం వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు.
* అనంతపురం : తాడిపత్రి లో కార్తిక మాసం మూడవ సోమవారం సందర్భంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు.
* అనంతపురం : అనంతపురంలో కనకదాసు జయంతి రాష్ట్రస్థాయి వేడుకకు హాజరు కానున్న మంత్రి సవిత.
* శ్రీ సత్యసాయి : నేటి నుంచి 24 వరకు పుట్టపర్తిలో సత్యసాయి బాబా 99వ జయంత్యుత్సవాలు.. వేణుగోపాల స్వామి రథోత్సవంతో వేడుకలు ప్రారంభం.. 22న సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 43వ స్నాతకోత్సవం.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి కోటిలింగాల ఘాట్ లో లక్షద్వీపోత్సవం.. పంతం చారిటబుల్ ట్రస్ట్, ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో లక్షద్వీపోత్సవం..
* తూర్పుగోదావరి జిల్లా: కార్తీకమాసం మూడవ సోమవారం కావడంతో రాజమండ్రిలో భక్తుల పుణ్యస్నానాలతో కిటకిటలాడుతున్న స్నానఘట్టాలు.
* కాకినాడ: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ కి నేటితో ముగియనున్న గడువు.. ఇప్పటివరకు నామినేషన్ దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు.. ఈనెల 19 న నామినేషన్ పరిశీలన, 21 వరకు ఉపసంహరణ గడువు.. వచ్చే నెల 5న ఎన్నికలు, తొమ్మిదిన ఫలితాలు
* అమరావతి: ఇవాళ ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు.. ముందుగా ప్రశ్నోత్తరాలు…
* తిరుమల: 3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,441 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,595 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు