High Alert In Rajasthan: భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ లో హై అలర్ట్ ప్రకటించారు. జై సల్మేర్, రాంఘడ్, బడ్ మేర్, ఫలోది, పోక్రాన్, బికనీర్, గంగానగర్ లో లాంటి సరిహద్దు జిల్లాల్లో బ్లాక్ అవుట్ విధించబడింది.
India Pakistan:భారత్ చేతిలో భంగపడుతున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం తన ప్రజల్ని ఫేక్ ప్రచారంతో నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ప్రతికూల విషయాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ పాక్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్, పాక్ మీడియా కలిసి పాక్ ప్రజల్ని బకరాలను చేస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా మరి కాసేపట్లో ఎయిర్ రైడ్స్ సైరన్ల రిహార్సల్స్ చేస్తున్నారు. డైరక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో సైరన్ రిహార్సల్స్ చేయనున్నారు. వైమానిక దాడుల సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ సైరన్లు మోగనున్నాయి.
Pakistan: భారతదేశం చేతిలో ఎన్ని సార్లు భంగపాటుకు గురైనా నాదే పైచేయి అంటుంది పాకిస్తాన్. అబద్ధాలను అవలీలగా ప్రచారం చేస్తుంది. చివరకు పాకిస్తాన్ ప్రభుత్వంలో అగ్ర నేతలుగా చలామణీ అవుతున్న వారు కూడా అబద్ధాలను ప్రచారంలో చేయడంలో పోటీ పడుతున్నారు. తమ పౌరుల్ని అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ నుంచి పాకిస్తాన్‌ని భారత్ త్రివిధ దళాలు చితకబాదుతున్నా కూడా బుద్ధి రావడం లేదు.
కాసేపట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ నిర్వహించిన సమావేశంలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులతో తాజాగా చర్చించిన అంశాలను ప్రధాని మోడీ దృష్టికి రాజ్నాథ్ తీసుకెళ్లనున్నారు.
India Pakistan War: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత భూభాగాలపై పాకిస్తాన్ గురువారం సాయంత్రం క్షిపణులు, డ్రోన్లతో అటాక్ చేసింది. వీటిని మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. దీని తర్వాత పాకిస్తాన్‌లో భారత త్రివిధ దళాల దీపావళి మొదలైంది.
Pakistan: ‘‘ఆపరేషన్ సింధూర్’’ దెబ్బ పాకిస్తాన్‌కి బాగా తగినట్లు ఉంది. అయితే, ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో మాత్రం భారత్ దాడి వల్ల నష్టపోయామని ఒప్పుకోవడం లేదు. పాకిస్తాన్ జరిపిన దాడిలో భారత్ తీవ్రంగా నష్టపోయిందని, తన ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.
సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. ముఖ్యంగా పాక్ తో సరిహద్దు పంచుకుంటున్న గుజరాత్ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
ఇక, యుద్ధాన్ని ముగించండి అంటూ భారత, పాకిస్తాన్ ప్రధానులకు విజ్ఞప్తి చేశారు పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ.. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై శ్రీనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ కాల్పుల్లో పిల్లలు, మహిళలు చిక్కుకుపోవడానికి వారి చేసిన తప్పు ఏమిటి? అని ప్రశ్నించారు.. సైనిక చర్య సమస్యను పరిష్కరించదని అభిప్రాయపడిన ఆమె.. ఇది ఎప్పుడూ సమస్యను పరిష్కరించదు.. శాంతిని అందించదు అన్నారు...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్ఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సీఐఎస్ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో, ఎయిర్ పోర్టుల్లో భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. కాగా, ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. కేంద్రమంత్రి ఇంట్లో ఈ కీలక సమావేశం జరిగింది.