India Pakistan War: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత భూభాగాలపై పాకిస్తాన్ గురువారం సాయంత్రం క్షిపణులు, డ్రోన్లతో అటాక్ చేసింది. వీటిని మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. దీని తర్వాత పాకిస్తాన్‌లో భారత త్రివిధ దళాల దీపావళి మొదలైంది. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి సహా అనేక ప్రధాన నగరాలపై భారత్ విరుచుకుపడింది. బయటకు చెప్పుకోలేకపోతున్నా భారత్ దెబ్బకు పాక్ తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఎఫ్-16, జేఎఫ్-17 వంటి విమానాలను భారత్ నేలకూల్చినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, శుక్రవారం(ఈ రోజు) రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. క్లోజ్డ్ డోర్ మీటింగ్ నిర్వహించారు. అయితే, ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్, ఇతర సైనికాధికారులు ఎంతో ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియలో చక్కర్లు కొడుతుంది. ‘‘ మీ నవ్వు చెబుతోంది, పాకిస్తాన్‌కి ఎలాంటి నష్టం జరిగిందనేది’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Pakistan: ‘‘మా ప్రధాని పిరికివాడు, మోడీ అంటే వణుకు’’.. షహబాజ్ షరీఫ్‌పై సొంత ఎంపీల ఆగ్రహం..
రాజ్‌నాథ్ సింగ్‌తో సహా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ K త్రిపాఠి హాజరైన ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్తాన్ జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాలపై గురువారం రాత్రి సమయంలో డ్రోన్,క్షిపణి దాడులు నిర్వహించిన 24 గంటల్లోపే ఈ సమావేశం జరిగింది. సమావేశంలో అందరూ ఎంతో ప్రశాంతంగా, నవ్వుతూ కనిపించడం చూస్తే పాకిస్తాన్‌ని ఏ విధంగా దెబ్బకొట్టారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
భారతదేశానికి ఉన్న ఎస్-400, ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్స్ పాక్ ప్రయత్నాలను గాలిలోనే బూడిద చేశాయి. పాకిస్తాన్ పంపిన మొత్తం 50 డ్రోన్లు, క్షిపణులను మన ఎయిర్ డిఫెన్స్ సమర్థవంతంగా గుర్తించి అడ్డుకుని, నాశనం చేసింది. ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ టార్గెట్‌గా బహుళ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది.