Pak Drone Attack: పాకిస్తాన్ తన కుట్రలను కొనసాగిస్తూనే ఉంది. పాక్ పౌర విమానాలను రక్షణగా ఉంచుకుని భారత్‌పై డ్రోన్ దాడులకు తెగబడుతోంది. వరసగా రెండో రోజు కూడా పాకిస్తాన్ భారత నగరాలే లక్ష్యంగా డ్రోన్ దాడులు చేసింది. అంతర్జాతీయ సరిహద్దు (IB),నియంత్రణ రేఖ (LOC)లను దాటి దాడి చేసేందుకు పాక్ ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలనున భారత సైన్యం భగ్నం చేసింది.
Donald Trump: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ భారత్‌పై వరసగా రెండో రోజు డ్రోన్ దాడులు చేసింది. సరిహద్దుల్లోని 20 నగరాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, వీటన్నింటిన భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. తాజాగా, ఉద్రిక్తతలపై ట్రంప్ స్పందించినట్లు వైట్ హౌజ్ ప్రకటించింది. త్వరగా సమస్య ముగియాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. Read Also: Pak drone attacks: 20 నగరాలను లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ తాజా డ్రోన్ దాడులు.. భారత్,…
Pak drone attacks: వరసగా రెండో రోజు దాయాది పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేశాయి. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థ వీటిని గుర్తించి, సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ముఖ్యంగా 26 నగరాలను లక్ష్యంగా చేసుకుని తాజా డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
IMF meeting: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పాకిస్తాన్‌కి అందించే బెయిలౌట్ ప్యాకేజీని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. గతంలో పాకిస్తాన్‌కి ఇచ్చిన రుణాలను దుర్వినియోగం చేసిందని, భారత్ తన ఆందోళనను వ్యక్త పరిచింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఐఎంఎఫ్ నిధులను దుర్వినియోగం చేస్తుందని చెప్పింది. పాకిస్తాన్ భారీ రుణభారం, ఆర్థిక వ్యవస్థల్లో పాక్ ఆర్మీ జోక్యాన్ని భారత్ ఐఎంఎఫ్ ముందు లేవనెత్తింది. ప్రపంచ ఆర్థిక విధానాలలో నైతిక పరిశీలనల అవసరాన్ని భారతదేశం నొక్కి చెప్పింది.
India Pakistan War: పాకిస్తాన్ తన తీరు మార్చుకోవడం లేదు. భారత్ చేతిలో చావు దెబ్బలు తింటున్నా.. యుద్ధానికే సిద్ధపడుతోంది. వరసగా రెండో రోజు కూడా డ్రోన్లతో భారత భూభాగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నించింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు యత్నించింది. ఈ దాడులను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది.
India Pakistan War: పాకిస్తాన్ వరుస దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ను మరోసారి బ్లాకౌట్ చేశారు. వరుసగా రెండో రోజు చీకటి పడగానే డ్రోన్లతో దాడికి పాక్ ప్రయత్నించింది. సుమారు 11 లొకేషన్లలో దాడులకు దిగింది పాకిస్తాన్.
India Pak War: పహల్గామ్ ఉగ్రవాద ఘటనకు భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యాలయాలను, వాటి శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 100కు మించి ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం, పాక్ భారత్‌పై దాడికి పాల్పడింది. దీని తర్వాత మరోసారి ఇండియా
IND vs PAK: పాకిస్తాన్ మళ్ళీ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడటంతో, భారత్ గట్టిగా బుద్ధి చెబుతోంది. పాక్ కాల్పులకు ఇండియన్ ఆర్మీ ధీటుగా జవాబు ఇస్తుంది. ఈ నేపథ్యంలో భారత్- పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
24 Airports Closed: భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాల్లోని 24 విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మే 15వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుందని పేర్కొనింది.
Nawaz Sharif: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం సాయంత్ర పాకిస్తాన్ వందలాది డ్రోన్లతో, క్షిపణులతో భారత్‌పై అటాక్ చేయడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ తరహా పరిస్థితులు నెలకున్నాయి. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కి, ఆయన సోదరుడు, మాజీ ప్రధాని అయిన నవాజ్ షరీఫ్ కీలక సూచనలు చేశారు. పెరుగుతున్న ఉద్రిక్తతల్ని తగ్గించుకోవడానికి దౌత్యపరమైన విధానం అవసరమని సలహా ఇచ్చినట్లు దిఎక్స్‌ప్రెస్…