Donald Trump: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌పై భారీ దాడులు నిర్వహించింది. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం కవ్వింపులకు దిగడంతో పాక్ వైమానిక దళానికి చెందిన 10 ఎయిర్ బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది.
India-Pakistan: అమెరికా నిఘా ఏజెన్సీ అయిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) మాజీ అధికారి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా, పాకిస్తాన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తప్పకుండా ప్రకంపనలు సృష్టిస్తాయి. 2001 పార్లమెంట్ దాడుల తర్వాత భారత్-పాకిస్తాన్‌లు యుద్ధానికి దిగుతాయని సీఐఏ విశ్వసించిందని జాన్ కిరియాకౌ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Pakistan: పాకిస్తాన్ తన చరిత్రను తప్పుగా చెప్పుకోవడం అలవాటు. ముఖ్యంగా, భారత్ విషయంలో ఏం జరిగినా, ఎన్ని యుద్ధాల్లో ఓడిపోయినా, చివరకు తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)ని కోల్పోయినా కూడా తమదే పై చేయి అని అక్కడి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరకు విద్యార్థులకు నిజాలు తెలియకుండా, తప్పుడు అంశాలను స్కూల్ పాఠ్యాంశాలుగా చేర్చుతోంది. తాజాగా, మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి కూడా అక్కడి టెక్ట్స్ బుక్స్‌లో తప్పుడు పాఠ్యాంశాన్ని చేర్చింది.…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అవే కామెంట్స్ చేశారు. వేదిక ఏదైనా తాను నిర్మొహమాటంగా భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. తాజాగా, 80 యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. తాను అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే అంతం లేని 7 యుద్ధాలను ఆపానంటూ చెప్పుకున్నారు.
Pakistan-Saudi Pact: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది అని అనుకోండి, పాకిస్తాన్ దారుణంగా దెబ్బతిన్నది ఊహించుకోండి, ఆ సమయంలో భారత్‌పై యుద్ధానికి సౌదీ అరేబియా వస్తుందా..? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్నగా ఉంది. తాజాగా, పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, అది రెండో దేశంపై దాడిగా పరిగణించబడుతుందనేది ఒప్పందం సారాంశం. అయితే, నిజంగా భారత్‌కు వ్యతిరేకంగా సౌదీ రాయల్ ఆర్మీ…
Indus Waters Treaty: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌కు సింధూ జలాలను ఆపేస్తూ.. భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఓ వైపు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, మాజీ మంత్రి బిలావల్ భుట్టో బెదిరింపులకు దిగుతుంటే.. మరోవైపు తమకు నీటిని రిలీజ్ చేయాలంటూ ఆ దేశ విదేశాంగ శాఖ ఇండియాను బతిమిలాడుతుంది. తమ దేశానికి నిలిపివేసిన సింధూ జలాల సరఫరాను తిరిగి పునరుద్ధరించాలని తాజాగా భారత్ ని కోరింది.…
పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి, పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ భారత్ తో యుద్ధం చేస్తానని బెదిరించారు. భారత్ సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసి సింధు నదిపై ఆనకట్ట నిర్మించడానికి ప్రయత్నిస్తే, పరిస్థితి యుద్ధానికి దారితీస్తుందని తెలిపాడు. భిట్ షాలో జరిగిన ‘షా లతీఫ్ అవార్డు’ ప్రదానోత్సవంలో హజ్రత్ షా అబ్దుల్ లతీఫ్ భిట్టై 282వ ఉర్సు సందర్భంగా బిలావల్ ఈ ప్రకటన చేశారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్‌పై…
MiG-21: భారత వైమానిక దళం(IAF)లో 62 ఏళ్ల పాటు సేవలు అందించిన రష్యన్ తయారీ ఫైటర్ జెట్ MiG-21 రిటైర్ కాబోతోంది. చివరి జెట్‌ను సెప్టెంబర్ 19న చండీగఢ్ వైమానిక స్థావరంలోని 23 స్క్వాడ్రన్ (పాంథర్స్) నుంచి ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. 1963లో వైమానిక దళంలో చేరిన మిగ్-21, 1965, 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధాల్లో, 1999 కార్గిల్ యుద్ధం, 2019లో బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్‌లలో కీలక పాత్ర పోషించింది.
Kharge Slams BJP: పహల్గామ్ ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్థించింది.. కానీ, బీహార్ ఎన్నికల ప్రచారంపై ఉన్న శ్రద్ధ.. నరేంద్ర మోడీకి దేశ భద్రతపై లేదని విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా అందరూ కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.. తెలంగాణలో కులగణన.. దేశానికే రోల్ మోడల్ అని తెలిపారు.