భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో.. వార్ బ్లాక్ అవుట్ వెలుగులోకి వచ్చింది.. బ్లాక్ అవుట్ అంటే ఏంటి..? అసలు ఎందుకు ఇది అమలు చేస్తారు? అనేది ఇప్పుడు చర్చగా మారింది.. అసలు Wartime Blackout అంటే ఏంటి? అనే విషయంలోకి వెళ్తే.. శత్రువుల నిఘా నుంచి.. వాళ్ల దాడుల నుంచి.. ప్రజలను రక్షించడానికి భద్రతా చర్యల్లో భాగంగా ప్రకటించేదే వార్‌టైమ్ బ్లాక్‌అవుట్..
ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి కీలక సూచనలు వచ్చాయని ప్రకటించారు చండీగఢ్ డిప్యూటీ కమిషనర్.. దాడి జరిగే అవకాశం ఉందని వైమానిక దళ కేంద్రం నుండి వైమానిక హెచ్చరిక అందింది.. సైరన్‌లు మోగుతున్నాయి.. అందరూ ఇంటి లోపలే ఉండండి.. ఇంట్లో బాల్కనీలకు కూడా దూరంగా ఉండాలని సూచించారు చండీగఢ్ డిప్యూటీ కమిషనర్..
పాక్ పన్నాగాలను తిప్పికొడుతూనే.. ముందుస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది భారత్.. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో అంతటా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.. జమ్మూతో పాటు కాశ్మీర్ అంతటా అన్ని పాఠశాలలు నేడు మరియు రేపు మూసివేయబడతాయి..
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పాక్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వీరేంద్ర సెహ్వాగ్.. పాక్ యుద్ధం కోరుకుంది.. దానికి భారత్ సరైన గుణపాఠం చెబుతుందని పేర్కొన్నాడు.. 'ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ మౌనంగా ఉండాలి.. కానీ, ఆ అవకాశాన్ని వదులుకొని యుద్ధం కోరుకుంటుంది.. ఉగ్రవాదుల ఆస్తులను రక్షించడమే కాదు.. వారి గురించి ఎక్కువగా మాట్లాడటం చేశారు.. దానికి భారత భద్రతా దళాలు తప్పకుండా సరైన సమాధానం ఇస్తుంది.. పాకిస్తాన్ ఎప్పటికీ మరిచిపోలేని రీతిలో ఉంటుంది' అంటూ ట్వీట్ చేశారు…
నిన్న రాత్రి, పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) మరియు అంతర్జాతీయ సరిహద్దులు (IB) వెంబడి వివిధ ప్రదేశాలకు డ్రోన్లను పంపడానికి పాక్ విఫలయత్నం చేసింది.. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా మరియు పఠాన్‌కోట్ ప్రాంతాలలో పాక్ చర్యలకు భారత్ తిప్పికొట్టింది.. భారత ఆర్మీ వైమానిక రక్షణ విభాగాలు ఉపయోగించి.. పెద్ద ఎత్తున కౌంటర్-డ్రోన్ ఆపరేషన్‌లో 50కి పైగా పాక్ డ్రోన్‌లను విజయవంతంగా తటస్థీకరించింది..
Jammu Kashmir: ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరి ప్రాంతంలో పాకిస్తాన్ సరిహద్దు షెల్లింగ్‌లో గురువారం ఒక మహిళ మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం జరిగింది. ఇక అధికారుల ప్రకారం, రేజర్వానీ నుంచి బారాముల్లా వెళ్ళిన ఒక వాహనం మొహురా సమీపంలో శెల్లింగ్ దాడికి గురైంది. ఈ దాడిలో బశీర్ ఖాన్ భార్య నాగ్రిస్ బేగం అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. అలాగే రాజీక్ అహ్మద్ ఖాన్ భార్య మహిళ హఫీజా గాయాలపాలు…
India Pakistan: పాకిస్తాన్ తీరును భారత్ మరోసారి ఎండగట్టింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, రక్షణ శాఖ సంయుక్త సమావేశంలో పాకిస్తాన్ బుద్ధిని ప్రపంచానికి వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా దాయాది దేశంలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది.
Asaduddin Owaisi: AIMIM పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ఉగ్రవాదంపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంపై జిహాద్ పేరిట హత్యలు చేయాలని పాకిస్తాన్ మద్దతుతో ఉన్న ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని, పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యత వహించిన లష్కరే తోయిబాకి అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)పై అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని అన్నారు. Read Also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్‌కి దెబ్బ, చైనాకు…
Operation Sindoor: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) ప్రాంతం సహా పాకిస్తాన్ లోని అనేక ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించిన తర్వాత పాకిస్తాన్ లో తీవ్ర భయ వాతావరణం నెలకొంది. భారత్ మరొ దాడికి దిగవచ్చన్న ఆందోళనతో పాకిస్తాన్ అంతటా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అయితే తాజాగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో PMLN (పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్) ఎంపీ తాహిర్ ఇక్బాల్ కంటతడి పెట్టారు. ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని…