PM Modi: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోతున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దాయాది దేశం.. ఇప్పుడు మనపై రెచ్చగొట్టే చర్యలకు దిగుతుంది. డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ట్రై చేస్తుంది. వీటిని భారత బలగాలు సమర్థంగా ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. తాజాగా, సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. ముఖ్యంగా పాక్ తో సరిహద్దు పంచుకుంటున్న గుజరాత్ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
Read Also: Samsung Galaxy F56 5G: భారత్ లో అధికారికంగా విడుదలైన గెలాక్సీ F56..!
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో భద్రతా సన్నద్ధతపై ప్రధాని మోడీ ఆరా తీసి అక్కడ ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అయితే, భద్రతాపరంగా సున్నిత ప్రాంతాలైన కచ్, బనస్కంతా, పటాన్, జామ్ నగర్‌లో పౌరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భద్రతా చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా, ఇవన్నీ పాక్‌తో సరిహద్దు కలిగిన ప్రాంతాలు కావడంతో మరింత పటిష్టమై భద్రతా ఏర్పా్ట్లను చేయాలని సూచించారు. అయితే, ప్రస్తుతం పాక్ నుంచి దాడుల ముప్పు పొంచి ఉండటంతో.. సరిహద్దు జిల్లాల్లో అధికార యంత్రాంగం అలర్టైంది. ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలకు తగిన సూచనలు ఇస్తున్నారు.
Read Also: Operation Sindoor : నిన్న పాక్ అవాక్స్ వ్యవస్థను భారత్ కూల్చేసిందా.. పాక్ కు పెద్ద దెబ్బే
మరోవైపు, భారత్- పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే రక్షణ శాఖ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఆర్థిక, హోం, ఆరోగ్య శాఖల్లోనూ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. తమ మంత్రి వర్గంలోని ఉన్నతాధికారులతో ఆయా కేంద్రమంత్రులు వరుస సమావేశాలు అవుతున్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులు, ఆర్థికపరంగా సన్నద్ధత, ఆరోగ్య సేవల అందుబాటు తదితర అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు.