Asif Ali Zardari: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఏ విధంగా భయపడిందో, ఎలా దెబ్బతిందనే సమాచారం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. సాక్ష్యాత్తు ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారింది. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత దాడుల సమయంలో పాకిస్తాన్ అగ్ర నాయకత్వంలో భయానక వాతావరణం ఉందని జర్దారీ అంగీకరించారు. భారత దాడుల సమయంలో భద్రత కోసం బంకర్లోకి వెళ్లాలని తన సైనిక కార్యదర్శి తనకు…
Op Sindoor 2.0: పాకిస్తాన్‌ను ‘‘ ఆపరేషన్ సిందూర్ ’’ దాడులు భయపెడుతూనే ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ తీవ్రస్థాయిలో దాయాదిపై విరుచుకుపడింది. ఆనాటి దాడులు ఇప్పటికీ కూడా పాకిస్తాన్ భయపడేలా చేస్తున్నాయి. తాజాగా, ఆపరేషన్ సిందూర్ 2.0 దాడులు జరుగుతాయనే భయంతో పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో నియంత్రణ రేఖ(LOC) వెంబడి ఆయుధాలను మోహరిస్తోంది. ఎల్ఓసీ, పాక్ ఆక్రమితక కాశ్మీర్(పీఓకే) ప్రాంతాల్లో కౌంటర్ డ్రోన్ మోహరింపుల్ని గణనీయంగా పెంచింది. కౌంటర్ అన్ మ్యాన్డ్ ఎరియల్…
Pakistan: పాకిస్తాన్ రాజకీయ నేత, పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జమియత్ ఉలేమా ఇ ఇస్లాం నాయకుడు, సీనియర్ రాజకీయ నేత మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్, మునీర్ అరాచకాలపై నిప్పులు చెరిగారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడులు నిర్వహించింది.
Asim Munir: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ పాకిస్తాన్, దాని మిలిటరీ చీఫ్ అసిమ్ మునీర్‌లకు బుద్ధి రావడం లేదు. మరోసారి మునీర్ భారత్‌ను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో భారత్ ఏదైనా దురాక్రమణకు పాల్పడితే పాకిస్తాన్ వేగంగా, తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. ‘‘ఏదైనా దురాక్రమణ జరిగితే పాకిస్తాన్ ప్రతిస్పందన మరింత వేగంగా, తీవ్రంగా ఉంటుంది. భారత్ ఎలాంటి భ్రమల్లో ఉండకూడదు’’ అని గత వారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(సీడీఎఫ్) పదవిని స్వీకరించిన…
Indian Army: పాకిస్థాన్ నుంచి ఏదైనా కొత్త దురాక్రమణ జరిగితే, ఆపరేషన్ సింధూర్ కంటే మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సైన్యం సిద్ధంగా ఉందని వెస్ట్రన్ కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ వెల్లడించారు. హరిద్వార్ మారుమూల ప్రాంతాలలో “రామ్ ప్రహార్” విన్యాసాల చివరి రోజున ఆయన పాల్గొని మాట్లాడారు. పాకిస్థాన్ నుంచి మరొక రెచ్చగొట్టే అవకాశాన్ని తోసిపుచ్చలేమని, ఇది ఆపరేషన్‌ను తిరిగి ప్రారంభించాల్సిన అవసరానికి దారితీస్తుందని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ…
Pakistan: పాకిస్తాన్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల చీఫ్‌గా, సీఐఏ అధికారిగా 15 ఏళ్ల పనిచేసిన జాన్ కిరియాకౌ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మిలియన్ల కొద్ది అమెరికా సాయం తీసుకున్న విషయాన్ని వెల్లడించారు. ఆయన హయాంలోనే పాకిస్తాన్ అణ్వాయుధాలను అమెరికా నియంత్రించిందని పేర్కొన్నారు. ముషారఫ్ అణు నియంత్రణను అమెరికాకు అమ్మేశాడని ఆయన అన్నారు.
India-Pakistan: అమెరికా నిఘా ఏజెన్సీ అయిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) మాజీ అధికారి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా, పాకిస్తాన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తప్పకుండా ప్రకంపనలు సృష్టిస్తాయి. 2001 పార్లమెంట్ దాడుల తర్వాత భారత్-పాకిస్తాన్‌లు యుద్ధానికి దిగుతాయని సీఐఏ విశ్వసించిందని జాన్ కిరియాకౌ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Indian Military: భారత సైన్యం మరింత ఆధిపత్యాన్ని చూపబోతోంది. ముఖ్యంగా పాకిస్తాన్, చైనాలకు వార్నింగ్ మెసేజ్ ఇచ్చే విధంగా భారత సైన్యానికి రూ. 79,000 కోట్లతో రక్షణ పరికరాల కొనుగోళ్లకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని ‘‘డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్’’ ఆమోదం తెలిపింది.
Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బుద్ధి ఇంకా మారలేదు. పహల్గామ్ దాడి తర్వాత, పాక్ సైన్యాన్ని ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా చిత్తు చేసినప్పటికీ, ఇంకా ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నాడు. మరోసారి, భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేశాడు. ఓ వైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యాన్ని ప్యాంట్లు విప్పించి, పరిగెత్తిస్తున్నా కూడా తమది గ్రేట్ ఆర్మీ అని పాక్ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. తమ వద్ద అణు ఆయుధాలు ఉన్నాయని బెదిరించే ప్రయత్నం…
Pakistan Security Crisis: ఈ ఏడాది పాకిస్థాన్ మూడు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది. వాస్తవానికి పాకిస్థాన్ తన స్వయం కృత చర్యల కారణంగా మూడు వైపుల నుంచి యుద్ధం పరిస్థితులను సృష్టించుకుందని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ తూర్పు వైపులో భారతదేశంతో ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. అదే సమయంలో పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘన్ తాలిబన్లతో తీవ్ర ఘర్షణ చెలరేగుతోంది. ఇప్పటికే తాలిబన్లు డజన్ల కొద్దీ పాకిస్థాన్ సైనికులను చంపి, అనేక పోస్టులను స్వాధీనం చేసుకున్నారు. ఇంకో వైపున నైరుతిలోని…