Pakistan: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. భారతదేశ ‘‘హిందుత్వ’’ తీవ్రవాదం ప్రపంచానికి ప్రమాదమని అబద్ధాలను ప్రచారం చేశాడు. పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశం అని చెబుతూ, జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ సంఘటనను ప్రస్తావిస్తు ‘‘హిందుత్వ తీవ్రవాదం’’ ప్రపంచానికి ముప్పు కలిగిస్తుందని ఆరోపించాడు.
Bombay High Court: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌కు సమాధానం ఇచ్చింది. పీఓకే, పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. అయితే, మన దేశంలో కొంత మంది మాత్రం దీనిని సమర్థించకుండా, ‘‘ఆపరేషన్ సిందూర్’’కు వ్యతిరేక పోస్టులు పెడుతూ, పాకిస్తాన్ ప్రేమను చూపించారు. ఇలాంటి కేసును విచారిస్తున్న బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
India: సౌదీ అరేబియా-పాకిస్తాన్ కీలకమైన ‘‘వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని’’ కుదర్చుకున్నాయి. దీని ప్రకారం, ఒక దేశంపై దాడి రెండు దేశాలపై దాడిగా గుర్తిస్తామని ఒప్పందం నొక్కి చెబుతోంది. దీని ద్వారా, భారత ప్రయోజనాలకు దెబ్బపడే అవకాశం ఉంది. దీనిపై భారత్ స్పందించింది. భారత్- సౌదీ అరేబియా పరస్పర ప్రయోజనాలు, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుంటుందని ఆశిస్తున్నట్లు భారతదేశం తెలిపింది.
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ భారత్‌పై విషం కక్కుతూనే ఉంది. ఇప్పటికే, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ భారతదేశంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హిందువులు, ముస్లింలు వేరు అంటూ, కాశ్మీర్ తన జీవనాడి అంటూ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు వచ్చిన కొన్ని రోజులకు, పమల్గామ్లో 26 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఇప్పుడు, ఆసిమ్ మునీర్ దారిలోనే పాక్ ఆర్మీ అధికారులు నడుస్తున్నారు.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఆ దేశ ఆర్మీపై భీకర దాడులు చేసింది. ముందుగా, పీఓకేతో పాటు పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల కార్యాలయాలు, స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది.
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా సెప్టెంబర్ 25న ఇద్దరు పాక్ నాయకులు ట్రంప్‌తో చర్చలు జరుపుతారని పాకిస్తాన్ మీడియా పేర్కొంది.
Pakistan: పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పంజాబ్‌లోని మురిడ్కే లోని లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్‌ని ధ్వంసం చేసింది. మే 7న భారత్ జరిపిన దాడిలో లష్కర్ ప్రధాన కార్యాయలం దెబ్బతిన్నది. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ దెబ్బతిన్న భవనం శిథిలాలను తొలగిస్తోంది. కొత్తగా భవనాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది.
Donald Trump: భారత్- అమెరికా మధ్య గత 25 సంవత్సరాలుగా సంబంధాలు క్రమంగా పటిష్టం అవుతున్నాయి. కానీ, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని తీవ్రగా వ్యతిరేకిస్తున్న ట్రంప్.. భారత్ నుంచి వెళ్తున్న డబ్బును ఉక్రెయిన్‌తో యుద్ధానికి రష్యా ఖర్చు చేస్తోందని పలుమార్లు ఆయన ఆరోపించారు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తక్షణమే…
Pakistan reaction Agni 5: భారతదేశం అగ్ని-5 క్షిపణిని పరీక్షించడం ద్వారా ప్రపంచానికి తన శక్తిసామర్థ్యాలను చూపించినట్లు అయ్యింది. పలువురు విశ్లేషకులు.. అగ్ని 5 మంటలు పాకిస్థాన్‌లో చెలరేగాయని అభిప్రాయపడ్డారు. దాయాది దేశం ఇండియా శక్తిని చూసి విషం కక్కుతోంది. అదే సమయంలో చర్చల కోసం విజ్ఞప్తి చేస్తోంది. భారత్ పరీక్షించిన అగ్ని 5 క్షిపణి ప్రాంతీయ, ప్రపంచ శాంతి, స్థిరత్వానికి ముప్పు అని పాక్ నేతలు ప్రకటనలు ఇస్తున్నారు.. తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ…
Pakistan Rocket Force: పాకిస్థాన్ సైనిక దళంలోకి కొత్త ఫోర్స్ రానున్నట్లు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. పాక్ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేలా సైన్యంలో కొత్తగా రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి అత్యాధునిక టెక్నాలజీ సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌లో భారత్ క్షిపణుల దెబ్బతిన్న తర్వాత పాక్ కొత్తగా తన సైనిక దళంలో రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. READ MORE: ECI Slams Rahul…