Asim Munir nuclear threat: అమెరికా పర్యటనలో పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ అణు బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసింది. ఇటీవల అమెరికాలో ప్రవాస పాకిస్థానీయులతో జరిగిన సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలో నిలిచిన సంగతి విదితమే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అసలు ఎందుకు ఆయకు ఇంత బలుపు అని చర్చించుకుంటున్నారు. ఏంటి ఆయన కెపాసిటీ.. ఆయన వ్యాఖ్యల వెనుక ఉద్దేశాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ MORE:…
Asaduddin Owaisi Slams Pakistan PM: ఇస్లామాబాద్‌లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా భారత్‌పై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. తమకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా గుంజుకునేందుకూ భారత్‌కు అవకాశం ఇవ్వబోమన్నారు. నదీ జలాలను నిలిపివేసేందుకు తీసుకునే ఏ చర్య అయినా యుద్ధానికి కవ్వింపుగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ ఆపరేషన్‌ను కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా అమలు చేశాయని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. మన పౌరులను బలి తీసుకున్న టెర్రరిస్టులను అంతం చేయాలని త్రివిధ దళాలు కోరగానే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
Jaish-e-Mohammed: పాకిస్థాలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ మళ్లీ చురుగ్గా మారుతోంది. పహల్గామ్ దాడి తర్వాత.. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్థాన్‌లోని బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా జైషే మహ్మద్ ఈ ప్రధాన కార్యాలయాన్ని మరోసారి పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ దీని కోసం ఆన్లైన్ ప్రచారాన్ని ప్రారంభించాడు. విరాళాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నాడు. పాకిస్థాన్‌లోని దక్షిణ పంజాబ్ ప్రావిన్స్ కి 100 కి.మీ…
Tayfun Block-4: పాకిస్తాన్‌తో ఫ్రెండ్షిప్ చేస్తున్న టర్కీ ఇప్పుడు తన మొదటి ‘‘హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్’’ని తయారు చేసింది. ‘‘టేఫన్ బ్లాక్’’ అనే క్షిపణిని ఇస్లాంబుల్‌లో జరిగిన అంతర్జాతీయ రక్షణ పరిశ్రమ ప్రదర్శన (IDEF) 2025లో ప్రదర్శించింది. ఈ కొత్త క్షిపణిని టర్కిష్ రక్షణ సంస్థ రోకెట్సన్ డెవలప్ చేసింది. ఇది టర్కీ దేశీయంగా తయారు చేసిన అత్యంత పొడవైన బాలిస్టిక్ మిస్సైల్ అయిన టేఫన్కు హైపర్సోనిక్ వెర్షన్.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ముందుగా ఉగ్రవాద స్థావరాలను దెబ్బతీసిన భారత్, ఆ తర్వాత పాకిస్తాన్ కవ్వింపులకు తీవ్రమైన సమధానం ఇచ్చింది. పాకిస్తాన్ వైమానికదళానికి చెందిన 11 ఎయిర్ బేస్‌లపై అటాక్ చేసింది. ఇందులో నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రఫికీ, సర్గోదా, జకోబాబాద్, స్కర్దు వంటికి ఉన్నాయి.
Pakistan: పాకిస్తాన్ తన ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, కీలక ఉగ్రవాదులను రక్షించాలనేదే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంతో పాటు భారత్ కోరుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా ఉంది. వారిని జాతీయ ఆస్తులుగా పాకిస్తాన్ భావిస్తోంది. ముఖ్యంగా, ఏడుగురు టెర్రరిస్టులను దాయాది దేశం రక్షిస్తోంది. వీరందరూ భారత్ తో పాటు విదేశాల్లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడి పదుల సంఖ్యలో ప్రాణాలు తీశారు. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వీరందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.
Operation Sindoor: పహల్గాం ఉగ్రవాద ఘటన తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’తో విరుచుకుపడింది. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఇందులో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ హెడ్‌క్వార్టర్స్ అయిని మురిడ్కే, బహవల్పూర్ కూడా ఉన్నాయి. 100 మందికిపైగా టెర్రరిస్టులు ఈ దాడుల్లో హతమయ్యారు. అయితే, ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ సైన్యం భారత్‌పైకి దాడులు ప్రారంభించింది. ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన రెండు నెలల తర్వాత.. సైన్యం ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేసింది. పూంచ్, రాజౌరి జిల్లాల సరిహద్దులోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలో చొరబాటుకు ప్రయత్నిస్తుండగా పాక్ జాతీయుడిని అరెస్టు చేసింది. అయితే.. ఈ వ్యక్తికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారతదేశం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. పాక్‌కి చెందిన అనేక సైనిక, ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. మే 6-7 రాత్రి నుంచి మే 10 వరకు భారత వైమానిక దళం (IAF) జరిపిన దాడుల్లో పాకిస్థాన్ భారీ నష్టాలను చవిచూసింది. ఈ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన 6 పీఏఎఫ్ యుద్ధ విమానాలు, 2 AWACS, 1 C-130 విమానం, 30 క్షిపణులు, అనేక డ్రోన్లు (UCAV)లు…