Pakistan: భారత్ లక్ష్యంగా, పాకిస్తాన్ ఆర్మీ “రాకెట్ ఫోర్స్” ఏర్పాటు..
- భారత్ లక్ష్యంగా ‘‘రాకెట్ ఫోర్స్ కమాండ్’’ ఏర్పాటు చేస్తున్న పాక్..
- అసిమ్ మునీర్ నేతృత్వంలో కొత్తగా రూపుదిద్దుకుంటున్న దళం..
- ఆపరేషన్ సిందూర్ భంగపాటు తర్వాత పాక్ రక్షణ చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్తాన్ భారత్‌ను ఎదుర్కొనే పనిలో పడింది. పహల్గామ్ దాడి తర్వాత, భారత్ జరిపిన ప్రతీకార చర్యలో పాకిస్తాన్ దారుణంగా భంగపడింది. 11 ఎయిర్ బేసులపై భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇదే కాకుండా పీఓకే, పాకిస్తాన్ భూభాగాల్లో ఉన్న లష్కరేతోయిబా, జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
అయితే, ఈ దాడుల తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం ‘‘రాకెట్ ఫోర్స్ కమాండ్’’ ఏర్పాటు చేయనుంది. పాక్ సైన్యం చీఫ్ అసిమ్ మునీర్ నేతృత్వంలో ఈ ఫోర్స్ రూపుదిద్దుకుంటున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. లాంగ్ రేంజ్ స్ట్రైక్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్(సీడీఎఫ్) అసిమ్ మునీర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కార్ప్స్ కమాండర్ల సమావేశంలో ఈ రాకెట్ ఫోర్స్ కమాండ్‌కు ఆమోదం లభించింది. రాబోయే కొన్ని నెలల్లో దీనిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నారు.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
పాకిస్తాన్ రాకెట్ ఫోర్స్ కమాండ్, 2015లో చైనా స్థాపించిన రాకెట్ ఫోర్స్ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. ఈ కమాండ్‌కు లెఫ్టినెంట్ జనరల్(త్రీస్టార్) లేదా మేజర్ జనరల్ (టూ స్టార్) హోదా కలిగిన సీనియర్ పాక్ ఆర్మీ అధికారి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ప్రయోగించిన డ్రోన్లను, క్షిపణులు భారత ఎయిర్ డిఫెన్స్ సమర్థవంతంగా అడ్డుకుంది. ఇక భారత్ ప్రయోగించిన క్షిపణులను పాకిస్తాన్ వద్ద ఉన్న చైనీస్ డిఫెన్స్ నిలువరించలేకపోయింది.
ఇదిలా ఉంటే, భారత్ కూడా శక్తివంతమైన రాకెట్ ఫోర్స్‌ను సృష్టించాలనుకుంటున్నట్లు సమాచారం. అయితే, అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. చైనా, పాక్ సరిహద్దుల్లో ఎదురవుతున్న భద్రతా సవాళ్ల దృష్ట్యా భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ భారతదేశ సాయుధ దళాలను ఆధునీకరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. యుద్ధ స్వరూపం మారుతున్న నేపథ్యంలో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, హైపర్‌సోనిక్స్, రోబోటిక్స్ వంటి టెక్నాలజీతో సైన్యాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!