Pakistan: పాకిస్తాన్ రాజకీయ నేత, పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జమియత్ ఉలేమా ఇ ఇస్లాం నాయకుడు, సీనియర్ రాజకీయ నేత మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్, మునీర్ అరాచకాలపై నిప్పులు చెరిగారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడులు నిర్వహించింది. వీటిని ప్రస్తావిస్తూ.. పాకిస్తాన్ ఆఫ్ఘానిస్తాన్‌లో శత్రువులపై సైనిక దాడులు నిర్వహించడాన్ని సమర్థించుకుంటే, పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని భారత్ చేసిన వైమానిక దాడుల్ని పాకిస్తాన్ ఎలా సమర్థిస్తుంది? అని ప్రశ్నించారు.
Read Also: Crime: ప్రాణం తీసిన బిర్యానీ..! ఎక్కువ ఉప్పు వేసిందని భార్య దారుణ హత్య
కరాచీలోని లియారి ప్రాంతంలో జరిగిన మజ్లిస్-ఎ-ఇత్తిహాద్-ఎ-ఉమ్మత్ సమావేశంలో, అసిమ్ మునీర్ నేతృత్వంలో పాకిస్తాన్ సైన్యం నిర్వహించిన సైనిక కార్యకలాపాలను మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తీవ్రంగా ఖండించారు. పాక్ ఆఫ్ఘాన్‌పై జరిపిన దాడుల్లో చాలా మంది పౌరులు మరణించారని అన్నారు. ‘‘ మీరు ఆఫ్ఘాన్‌లోని మా శత్రువులపై దాడులు చేశామని సమర్థిస్తే, భారత్ పాక్‌లోని బలవల్పూర్‌లోని ఉగ్రవాదులపై దాడులు చేశామని చెప్పవచ్చు’’ అని అని ఫజ్లూర్ అన్నారు.