Asim Munir: పాకిస్తాన్ ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో, అది ఇప్పుడు నెరవేరుతోంది..
- పాకిస్తాన్ ఏర్పాటు లక్ష్యం నెరవేరుతోంది..
- అసిమ్ మునీర్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asim Munir: ఇస్లాం పేరుపై ఏర్పడిన పాకిస్తాన్, ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో, ఇప్పుడు అది సాధించే దిశగా ఉన్నామని పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అన్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవడు జునైద్ సఫ్దర్ వలీమాకు హాజరైన bilwkh ఆయన పాక్ వార్తా పత్రిక ది న్యూస్ ఇంటర్నేషనల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, సీనియర్ సైనిక అధికారులు, క్యాబినెట్ మంత్రులు హాజరయ్యారు.
పాకిస్తాన్ ఏ గొప్ప ఉద్దేశ్యాన్ని సాధించడానికి ఏర్పడిందో, అల్లా దయ చేత ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందని అన్నారు. పాక్ తన గమ్యం వైపు వెళ్తోందని మునీర్ వ్యాఖ్యానించారు. ‘‘పాకిస్తాన్ ఇస్లాం పేరుతో ఏర్పడింది. నేడు ఇస్లామిక్ దేశాల్లో ప్రత్యేక హోదా, ప్రాముఖ్యత సాధించింది’’ అని ఆయన చెప్పారు. అల్లా ఆశీర్వాదాల వల్లే ఇదంతా సాధ్యమైందని అన్నారు. ప్రపంచ వేదిపై పాకిస్తాన్ స్థానం, ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగైందని ఆయన అన్నారు. తనకు వ్యక్తిగతంగా వచ్చిన ఏ ప్రశంస అయినా అల్లా దయ వల్లే వచ్చిందని, ఒక వ్యక్తి పాకిస్తాన్ ఎప్పటికీ అధికమే అని చెప్పారు.
Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
Read Also: Virat Kohli Mystery Drink: ఇండోర్ వన్డే మ్యాచ్.. విరాట్ కోహ్లీ తాగిన ఆ మిస్టరీ డ్రింక్ ఏంటి?
ఇటీవల, యూఎస్‌తో పాకిస్తాన్ ‘‘రేర్ ఎర్త్ ఖనిజాల’’డీల్ కుదుర్చుకుంది. సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. దీంతో పాటు సౌదీ-పాక్-టర్కీలు కలిసి ఇస్లామిక్ నాటోకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ దేశాలపై తమ ఆధిపత్యం పెరిగిందని పాకిస్తాన్ భావిస్తోంది. ఇక గతేడాది భారత్‌తో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’లో తామే గెలిచామని పాకిస్తాన్ చెప్పుకుంటోంది. ఎయిర్ బేస్‌లు కోల్పోయిన తర్వాత కూడా పాకిస్తాన్ ఈ వాదన చేస్తోంది. ఇక ఈ ఘర్షణ తర్వాతే, ఆసిమ్ మునీర్‌కు పాక్ ప్రభుత్వం ‘‘ఫీల్డ్ మార్షల్’’ పదోన్నతిని ప్రకటించింది.
అసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌లో అత్యధిక మతోన్మాద భావాలను కలిగిన వ్యక్తి. తరుచుగా సైన్యాన్ని, పాకిస్తాన్‌ను మతంతో ముడి పెడుతున్నాడు. ఏప్రిల్ ఏప్రిల్ 2025లో ఇస్లామాబాద్‌లో జరిగిన ఓవర్సీస్ పాకిస్తానీ కన్వెన్షన్‌లో ప్రసంగిస్తూ, ముస్లింలు మరియు హిందువుల మధ్య సరిదిద్దలేని తేడాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఏర్పాటుకు ఇదే కారణమని, కల్మాపై ఆధారపడి ఉందని అన్నారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తే పాకిస్తాన్ ప్రపంచంలో ఇస్లామిక్ ప్రపంచానికి పెద్దన్న కావాలని ఆశ పడుతోందనేది సుస్పష్టం. ఇస్లామిక్ దేశాల్లో ప్రస్తుతం పాక్ వద్ద మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. దీని ద్వారా ఇస్లామిక్ నాటోను ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
తాజావార్తలు
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..