భారత్-బంగ్లాదేశ్ మధ్య గ్వాలియర్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. దీంతో భారత్ ముందు 128 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఈరోజు గ్వాలియర్ లో మొదటి టీ20 జరుగనుంది. ఈ క్రమంలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ తోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అడుగుపెడుతున్నాడు. ఇప్పుడు క్రికెట్ అభిమానుల అందరి దృష్టి అతని పైనే ఉంది. మయాంక్‌తో పాటు ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ బంగ్లాదేశ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు.
Sanju Samson Comes Opener in Gwalior T20: టెస్టుల్లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన భారత్ పొట్టి సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రాత్రి 7.30కు గ్వాలియర్‌లో మొదటి మ్యాచ్ ఆరంభం కానుంది. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కుర్రాళ్లు ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ లాంటి యువ ఆటగాళ్లకు సత్తా చాటడానికి ఈ సిరీస్ అవకాశం అనే చెప్పాలి. తొలి…
IND vs BAN 1st T20: ఈరోజు గ్వాలియర్ లోని మాధవరావ్ సింధియా స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 మ్యాచ్‌పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. గ్వాలియర్ నగరంలో బంగ్లాదేశ్‌లో హిందువులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, మహిళలపై తప్పుడు పనులు జరుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్ బంగ్లాదేశీయులతో క్రికెట్ మ్యాచ్ ఆడుతుండటంపై హిందూ మహాసభ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. నిరసనల దృష్ట్యా భద్రతను పెంచారు. సూర్య కుమార్ నేతృత్వంలో భారత్ టీ20 మ్యాచ్ ఆడడాన్ని…
బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీ20 సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే దూరమయ్యాడు. వెన్ను గాయం కారణంగా శివమ్ దూబే వచ్చే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.
ప్రతీ టెస్టు సిరీస్ తర్వాత ‘ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును బీసీసీఐ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ పదవీ కాలంలో ప్రవేశపెట్టిన అవార్డును.. గౌతమ్ గంభీర్ కోచ్‌గా వచ్చాక కూడా బీసీసీఐ కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ అనంతరం ఫీల్డింగ్‌లో మెరిసిన ఆటగాళ్లకు అవార్డును ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ప్రకటించారు. ఈసారి ఇద్దరు ప్లేయర్లకు దక్కడం విశేషం. వెనక్కి డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టిన మహ్మద్ సిరాజ్‌తో పాటు సిరీస్…
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించేందుకు తాము చాలా రిస్క్ తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. బ్యాటర్లు రిస్క్ తీసుకుని దూకుడుగా ఆడే క్రమంలో 100 పరుగులకు ఆలౌటైన ఫర్వాలేదనే మైండ్‌సెట్‌తో ఉన్నామని తెలిపాడు. పిచ్ పెద్దగా సహకరించకున్నా.. టీమిండియా బౌలర్లు గొప్పగా రాణించారని ప్రశంసించాడు. రెండో టెస్టు విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. డ్రా అవుతుందనుకున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన భారత్..…
Virat Kohli Gifts His bat to Shakib Al Hasan: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్‌కు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. మంగళవారం కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో ముగిసిన రెండో టెస్టు మ్యాచ్ అనంతరం షకిబ్ దగ్గరకు వెళ్లిన విరాట్.. సంతకం చేసిన తన బ్యాట్‌ను అతడికి అందించాడు. ఆపై ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. కోహ్లీ బ్యాట్‌తో షకిబ్ షాడో సాధన చేశాడు. స్వదేశంలో వీడ్కోలు పలికే అవకాశం…
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన మూడు వికెట్లు కోల్పోయి అందుకున్నది. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్ రోహిత్ (8), గిల్ (6) విఫలమైనప్పటికీ.. జైస్వాల్ (51), కోహ్లీ (29 నాటౌట్) రాణించారు. ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో…
కాన్పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దెబ్బకు 47 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. షద్మాన్ ఇస్లామ్ (50) హాఫ్ సెంచరీ చేయగా.. ముష్ఫికర్ రహీమ్ (37) రాణించాడు. టీమిండియా బౌలర్లు ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తలో మూడు వికెట్స్ పడగొట్టారు. భారత్ ఎదుట 95 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. లంచ్ బ్రేక్ అనంతరం భారత్ లక్ష్య చేధనకు దిగనుంది.…