IND vs BAN: కోహ్లీ కాళ్లు మొక్కిన గ్రౌండ్ సిబ్బంది.. వీడియో వైరల్!
- కాన్పూర్ వేదికగా రెండో టెస్టు
- కింగ్ పాదాలకు నమస్కరించిన అభిమాని
- నిలిచిపోయిన ఆట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత 16 ఏళ్లుగా అద్భుతమైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. భారతదేశంలోనే కాదు.. దాయాది పాకిస్తాన్‌లో కూడా మనోడికి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. తమ ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోసం ఫాన్స్ బారికేడ్లు దాటిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కోహ్లీ కాళ్లను తాకి తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఓ అభిమాని కోహ్లీపై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నాడు.
కాన్పూర్ వేదికగా నేడు భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌కు ముందు గ్రీన్ పార్క్ మైదానంలో వర్షం పడటంతో.. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. అంపైర్లు ఫీల్డ్‌ను తనిఖీ చేస్తుండగా.. కొందరు సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు సాధన కోసం గ్రౌండ్‌లోకి వచ్చారు. విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి వస్తుండగా.. గ్రౌండ్ సిబ్బంది ఒకరు కింగ్ వద్దకు వెళ్లి అతడి పాదాలకు నమస్కరించాడు. విరాట్ కూడా అతడికి మర్యాద ఇస్తూ.. వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
బ్యాడ్‌లైట్ కారణంగా భారత్, బంగ్లా రెండో టెస్టు ఆట నిలిచిపోయింది. చినుకులు పడుతుండటంతో అవుట్ ఫీల్డ్‌లోని చాలా ప్రాంతాలను గ్రౌండ్స్‌మెన్ కవర్లతో కప్పి ఉంచారు. ఫ్లండ్‌లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఆట కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగ్లా స్కోరు 35 ఓవర్లకు 107/3గా ఉంది. క్రీజ్‌లో ముష్ఫికర్ (6), మొమినల్ హక్ (40) ఉన్నారు.
VIRAT KOHLI, AN EMOTION ❤️
– A ground staff touched the feet of King Kohli at Kanpur. pic.twitter.com/MrkdGnmg04
— Johns. (@CricCrazyJohns) September 27, 2024
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!