కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య మరికొద్దిసేపట్లో రెండో టెస్టు ఆరంభం కానుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి మార్పులు లేవని రోహిత్ చెప్పాడు. పిచ్ ప్లాట్‌గా ఉందని, దాన్ని మా ముగ్గురు సీమర్లు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామన్నాడు. తొలి టెస్టులో సరైన ఆరంభం దక్కలేదని, ఈ టెస్ట్ కోసం బాగా సన్నద్ధం అయ్యామని రోహిత్ చెప్పుకొచ్చాడు. గ్రీన్ పార్క్ మైదానం తడిగా ఉండటంతో ఉదయం 9 గంటలకు పడాల్సిన టాస్ గంట ఆలస్యమయింది.
న్యూజీలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇస్తారని ప్రచారం జరిగింది. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి డుగుతుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ అవేమీ జరగలేదు. దాంతో కుల్దీప్, అక్షర్‌లకు నిరాశే ఎదురైంది. మరోవైపు షకిబ్ అల్ హాసన్ తుది జట్టులో ఉన్నాడు. ఫిట్‌నెస్ సమస్యలతో షకిబ్ బాధపడ్తున్నట్లు బంగ్లా కోచ్ చెప్పారు. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌లో ఒక టెస్టు గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్: షద్మాన్ ఇస్లామ్, జాకీర్ హసన్, నజ్ముల్ శాంటో, మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకిబ్ అల్ హాసన్, లిటన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లామ్, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.
🚨 Team Update 🚨
An unchanged Playing XI for #TeamIndia 👌👌
Live – https://t.co/JBVX2gyyPf#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/u61vd44i1C
— BCCI (@BCCI) September 27, 2024