భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. తొమ్మిదేళ్ల తర్వాత ఇండియాలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఉదయం తేలికపాటి చినుకులు పడి.. ఆ తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో.. రెండవ రోజు గ్రీన్ పార్క్ స్టేడియంలో ఆట జరగలేదు. మొదటి రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 35 ఓవర్ల ఆట తరువాత.. వర్షం కారణంగా ఆట రద్దు చేశారు. అంతకుముందు.. 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రోజంతా ఆడలేని పరిస్థితి ఏర్పడింది.
2015లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో వర్షం కారణంగా మ్యాచ్ డ్రా అయింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్.. ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. భారత్ 22 ఓవర్లలో 80 పరుగులు చేసినప్పటికీ ఆ తర్వాత మ్యాచ్ డ్రాగా ప్రకటించాల్సి వచ్చింది.
Read Also: Health: వేగంగా విస్తరిస్తున్న సమస్య.. ప్రతి 10 మందిలో ముగ్గురికి ఈ వ్యాధి
ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికొస్తే.. రెండవ రోజు 11:15 గంటలకు వర్షం ఆగిపోయినప్పుడు గ్రౌండ్స్‌మెన్ మూడు సూపర్ సాపర్లను ప్రయోగించారు. వెలుతురు కూడా స్పష్టంగా లేదు.. దీంతో అధికారికంగా 2:15కి గేమ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. వాతావరణ శాఖ ప్రకారం.. ఆదివారం కూడా వర్షం పడే అవకాశం ఉంది. అయితే సోమ, మంగళవారాల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో.. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తొలి రోజు వర్షం కారణంగా బంగ్లాదేశ్ 35 ఓవర్లు మాత్రమే ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. భారత ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ బంగ్లాదేశ్ ఓపెనర్లు జకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాంలను అవుట్ చేయగా.. రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో వికెట్ తీశాడు. తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.
Read Also: PM Modi: సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాదానికి బుద్ధి చెప్పాం