KL Rahul about Kanpur Test: కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో డగౌట్‌లోని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి తమకు స్పష్టమైన సందేశం వచ్చిందని స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చెప్పాడు. ఔటైనా ఫర్వాలేదు కానీ.. వేగంగా ఆడి ఎక్కువ పరుగులు చేయాలని సూచించాడని తెలిపాడు. కెప్టెన్ ఆదేశాలకు తగ్గట్టుగానే ఆడినట్లు రాహుల్ వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దాంతో బంగ్లాదేశ్‌పై భారత్ ఆధిపత్యం కొనసాగించింది.…
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ దూకుడుగా ఆడుతోంది. వర్షం కారణంగా కేవలం నాలుగు సెషన్ల ఆట మాత్రమే సాగినా.. మ్యాచ్‌లో రోహిత్ సేన ఆధిపత్యం కొనసాగిస్తోంది. మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాను 233 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసి 52 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా ఓపెనర్లను పెవిలియన్ చేర్చింది. ప్రస్తుతం బంగ్లా స్కోర్…
Ravichandran Ashwin’s WTC Record: చెపాక్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్.. కాన్పూర్ టెస్టులోనూ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 45 రన్స్ ఇచ్చి రెండు వికెట్స్ పడగొట్టాడు. దీంతో వరుసగా మూడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిళ్లలో 50 ప్లస్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా యాష్ నిలిచాడు. డబ్ల్యూటీసీ 2023-25లో ఇప్పటివరకు 50 వికెట్లు తీసిన అశ్విన్.. డబ్ల్యూటీసీ 2019-21 సీజన్‌లో 71 వికెట్లు, 2021-23 సీజన్‌లో…
టెస్టుల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సరికొత్త రికార్టు నెలకొల్పింది. అత్యల్ప బంతుల్లో 50 పరుగులు చేసింది. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 18 బంతుల్లోనే 50 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఈ అరుదైన రికార్డును సాధించారు. దాంతో ఇంగ్లండ్ రికార్డు బద్దలైంది. గతంలో ఇంగ్లీష్ జట్టు 26 బంతుల్లో 50 రన్స్ చేసింది. భారత్ టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీ కూడా ఇదే. రోహిత్…
కాన్పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఆలౌటైంది. 74.2 ఓవర్లలో 233 పరుగులకు కుప్పకూలింది. మొమినల్ హక్ (107 నాటౌట్) సెంచరీ చేయగా.. నజ్ముల్ శాంటో (31), షద్మాన్ ఇస్లామ్ (24), మెహిదీ హసన్ మిరాజ్ (20) పరుగులు చేశారు. భారత బౌలరు జస్ప్రీత్ బుమ్రా 3, మహమ్మద్ సిరాజ్ 2, ఆకాశ్ దీప్ 2, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, రోహిత్ శర్మ అద్భుత ఫీల్డింగ్‌తో…
Mohammed Siraj Sensational Catch in Kanpur Test: కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. హిట్‌మ్యాన్ సూపర్ క్యాచ్ అందుకున్న కాసేపటికే టీమిండియా పేసర్, మన హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ అబ్బురపరిచే ఫీల్డింగ్ విన్యాసంతో మెరిశాడు. గాల్లో వెనక్కి డైవ్ చేస్తూ ఊహించని రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్…
Rohit Sharma Single Hand Catch: కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. మిడాఫ్‌లో ఊహించని క్యాచ్‌ను హిట్‌మ్యాన్ అందుకున్నాడు. రోహిత్ గాల్లోకి ఎగిరి మరీ ఒంటిచేత్తో క్యాచ్‌ను అందుకున్న తీరును చూసి.. బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ సహా భారత ఆటగాళ్లు సైతం నోరెళ్లబెట్టారు. రోహిత్ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్…
Kanpur Test Session Timings: కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు ఎట్టకేలకు ప్రారంభం అయింది. నాలుగో రోజు ఆట కొనసాగుతోంది. వర్షం కారణంగా తొలి రోజు 35 ఓవర్లు మాత్రమే సాధ్యం కాగా.. రెండు, మూడు రోజుల్లో ఒక్క బంతి కూడా పడలేదు. మూడోరోజైన ఆదివారం వర్షం లేకున్నా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్న కారణంగా ఆట రద్దయింది. తొలి మూడు రోజుల్లో 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వరణుడు శాంతించడంతో నాలుగో…
ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన క్రికెట్ బోర్డు ఏదంటే.. అందరూ టక్కున బీసీసీఐ అనే చెప్తారు. ఐపీఎల్, దేశవాళీ, అంతర్జాతీయ టోర్నీలతో ఏటా భారీగా ఆదాయం సంపాదిస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ ద్వారా కోట్లు గడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న బీసీసీఐ.. మైదానాల విషయంలో మాత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఇందుకు కారణం అహ్మదాబాద్, నోయిడా, కాన్పూర్ మైదానాల్లో జరిగిన ఘటనలే. వర్షం ఆగిన గంటల వ్యవధుల్లోనే స్టేడియాలు సిద్ధమయ్యేలా మౌలిక వసతులు లేకపోవడంతో.. అత్యంత సంపన్నమైన బోర్డు…
కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మూడో రోజు ఆట కూడా రద్దైంది. రెండో రోజు మాదిరిగానే.. ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దైంది. మూడో రోజైన ఆదివారం వర్షం లేకపోయినా.. మైదానం చిత్తడిగా ఉండటంతో ఆట నిర్వహణకు సాధ్యపడలేదు. మూడోసారి పరిశీలించిన అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పిచ్, మైదానాన్ని అంపైర్లు పరిశీలించారు. మైదానం చిత్తడిగా…