హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ ఏక్ నిరంజన్‌గా మిగిలిపోయారా? ఇక చాలు అని బీజేపీ నేతలకు చెప్పేశారా? పోలింగ్‌కు మిగిలిన మూడు రోజులు ఆయన ఎవరిపై నమ్మకం ఉంచుతున్నారు? ఈటలలో వచ్చిన మార్పేంటి? లెట్స్ వాచ్..! బీజేపీ వారిని సర్దుకోవాలని చెప్పారా? హుజురాబాద్‌లో ఈ నెల 30 పోలింగ్. 72 గంటల ముందే ప్రచారానికి ఫుల్‌స్టాప్. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గమంతా కలియ తిరిగారు. ఉపఎన్నిక…
హుజురాబాద్ ఉపఎన్నికల్లో కోవిడ్ ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలి అని హుజురాబాద్ కోవిడ్ ఆఫీసర్ డాక్టర్ శ్వేతా తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ ను సానిటైజ్ చేస్తున్నాం అని చెప్పిన ఆవిడ… 306 పోలింగ్ బూతుల్లో, 306 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లక్షణాలుంటే సెంటర్ వద్దే కరోనా టెస్ట్ చేస్తారు. ప్రతి ఓటర్ మాస్క్ ధరించాలి.. ఓటర్ల మధ్య 6 మీటర్ల దూరం పాటించాలి. దీని పై ఓటర్లను ముందే అవేర్ చేస్తున్నాం అని చెప్పిన…
హుజూరాబాద్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేపు ఇక్కడి నుండే ఈవీఎం , పోలింగ్ సామగ్రి తీసుకొని తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్స్ కి పోలింగ్ సిబ్బంది వెళ్లనున్నారు. ఈ ఎన్నికలో మొత్తం 306 పోలింగ్ స్టేషన్స్ ఉండగా… 2 లక్షల 37 వేల 36 మంది ఓటర్లు ఉన్నారు. అయితే కోవిడ్ ప్రోటోకాల్ తో పోలింగ్ జరగనుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ లో హెల్త్ సిబ్బంది ఉంటారు. ఓటర్ కి ఓటర్ కి…
హుజురాబాద్‌లో టీఆర్ఎస్ శ్రేణులు ఆశ.. నిరాశల మధ్య ఊగిసలాడారా? పార్టీ చీఫ్ కేసీఆర్ ఎన్నికల సభ ఉంటుందని.. ఆ తర్వాత ఉండదని తేలడంతో ఆలోచనలో పడ్డారా? ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడిన మాటలు.. కేడర్‌లో ఉత్సాహం నింపాయా? కేసీఆర్ సభతో గెలుపు ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలని చూశారు..! హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచార గడువు ముగిసే టైమ్ దగ్గర పడింది. ప్రధానపార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అధికారపార్టీ టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేలా పావులు కదుపుతోంది. కీలక ఎన్నికల బాధ్యతల్లో…
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. గత నెల 28న హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిననాటి నుంచి నేటి వరకు కరీంనగర్ కమిషనరేట్, వరంగల్ కమిషనరేట్ సంబంధించి కమలాపూర్ మండల పరిధిలో ఎన్నికల దృష్ట్యా 10 చెక్ పోస్టులు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్, 5 ఏంసీసీ, 10 వీఎస్‌టీ లను ఏర్పాటు చేసి, పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నామని తెలిపారు. తనిఖీల్లో…
కాలంతో పాటు ఎన్నికల ప్రచారం తీరు కూడా మారింది. ఒకప్పుడు నాయకుడు ఊళ్లోకి వస్తున్నాడంటే జనం ఆయనను చూడటానికి స్వచ్ఛందంగా వెళ్లేవారు. పనులు మానుకుని ఆయన రాకకోసం ఎదురుచూసేవారు. చెప్పింది శ్రద్ధగా వినేవారు. నాడు నాయకుల మాటల్లో ..హావ బావాలలో హూందాతనం ఉట్టిపడేది. ప్రజలతో మమేకమయ్యేవారు. ప్రత్యర్థులను విమర్శించాల్సి వస్తే సహేతుక ..సంస్కారవంతమైన భాష ఉపయోగించేవారు. కానీ నేడు ..నాయకుల తీరు చూస్తున్నాం.. నోరు తెరిస్తే బూతులు. అబద్దాలు. మర్యాద అన్నది మచ్చుకు కూడా కనిపించదు. నాడు…
హుజురాబాద్ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నిలవాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 70 శాతం తెలంగాణ ప్రజలు వ్యవసాయంపై బ్రతుకుతారు. అందులో ఎక్కువగా వరి సాగే వుంటది. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వరి సాగే అవుతుంది. సర్కార్ తుగ్లక్ పాలనలా.. నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం msp ప్రకటించింది.. దాని ప్రకారం కొనాల్సిందే. తెలంగాణను రైస్ బౌల్ చేస్తామన్నారు.. కేసీఆర్. ఇప్పుడు కొనం అని చెప్పడం సిగ్గు చేటు. సిద్దిపేట కలెక్టర్…
హుజురాబాద్ ఉప ఎన్నికకు ఈ రోజు సాయంత్రంతో ప్రచార సమయం ముగియనుంది. దీంతో నాయకులు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. ఓటర్లను తిప్పుకునేందుకు చివరి ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌లో ఓటమి ఖాయమని తెలిసి ప్రస్టేషన్‌తో కొంతమంది ఫోన్లు పగలకొడుతున్నారట అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు మాపై ఇచ్చిన ఫిర్యాదులతో మేము ఉన్న ఇండ్లను అధికారులు తనిఖీలు చేశారని ఆయన అన్నారు. మా ముఖ్యమంత్రి సభ పెట్టకుండా…
హుజురాబాద్ ఉప ఎన్నికపై ఆ నియోజకవర్గ ప్రజలే కాదు.. యావత్తు రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోంది. భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఆత్మగౌరవం అంటూ టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీలో చేరిన నాటి నుంచే ఈటల హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హుజురాబాద్‌లో టీఆర్ఎస్…
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతోంది. ఈ రోజు సాయంత్రంతో ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు నాయకులు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయిన్‌పల్లి వినోద్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ని గెలిపించే బాధ్యత మీది.. హుజురాబాద్ అభివృద్ధి మాది అంటూ వ్యాఖ్యానించారు. కమలాపూర్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని…