హుజురాబాద్ ఉపఎన్నికపై బెట్టింగ్ కోట్లల్లో నడుస్తోంది. ఏ పార్టీ గెలుస్తుంది..ఎన్ని ఓట్ల తేడాలో గెలుస్తుంది..ఏఏ ప్రాంతాల్లో ఎన్ని ఓట్లు వస్తాయని పెద్దఎత్తున పందాలు కాస్తున్నారు. బెట్టింగ్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో రహస్యంగా కొనసాగుతోంది. ఆఫ్‌లైన్‌లో సైతం బెట్టింగులు సాగుతున్నాయ్. హుజురాబాద్ ఉపఎన్నిక గెలుపు ఓటములపై కోట్లలో బెట్టింగులు సాగుతున్నాయి. తెలంగాణకు చెందిన వారితో పాటు వివిధ రాష్ట్రాల వారు సైతం బైపోల్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఐపీఎల్ ముగియడంతో పందెంరాయుళ్లు ఉపఎన్నికపై బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. గత నెల నుంచే బెట్టింగ్…
బీజేపీ ఆధ్వర్యంలో హుజురాబాద్ మధువని గార్డెన్ లో పురప్రముఖుల సమావేశం జరిగింది. దీనికి బీజేపీ రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. అందులో విద్యాసాగర్ రావు మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుస్తున్నారన్న టాక్ ఇప్పటికే వచ్చింది. హుజురాబాద్ గురించి తెలిసిన ప్రపంచంలోని అందరూ ఇదే మాట చెబుతున్నారు. ఈటల గెలిస్తే.. తెలంగాణ ప్రభుత్వం బీజేపీ పార్టీ చేతిలోకి వస్తుంది. దీన్ని…
హుజురాబాద్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నారు. నేతలు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు హద్దులు దాటుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. టీఆర్‌ఎస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ ఉద్యమ ద్రోహులకు, ఉద్యమ వ్యతిరేకులకు అడ్డాగా మారిందన్నారు. నాడు తెలంగాణ పోరాటాన్ని అణచి వేసిన వాళ్లే ఉద్యమకారులను వేధించిన వాళ్లే నేడు కేసీఆర్ దగ్గర కనిపిస్తున్నారన్నారు. కేసీఆర్‌కైనా సామాన్య కార్యకర్తకు అయినా, తన కైనా ఎలక్షన్ కమిషన్ రూల్స్…
ఆ రోజు మీటింగ్ లో కేసీఆర్ కు సహాయ సహకారాలు అందించిన ఒక్కరి పేరు కూడా ప్రస్తావించక పోవడం దుర్మార్గం అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ ను మెడలు పెట్టి బయటకు పంపించాడు…. హరీష్ రావు ను హుజూరాబాద్ లో చెట్టుకు కట్టేసాడు. హరీష్ రావును ఉరి పెడతాడేమోనని భయం భయంగా బ్రతుకుతున్నాడు.. కేజీ టు పిజి ఉచిత విద్య పై , ఉన్నత విద్యకు నిధుల కేటాయింపు పై చర్చకు సిద్ధమా, ఫీజు…
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డీజీపీ మహేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరి ఫోన్‌లు ట్యాప్ చేయట్లేదని.. ఫోన్ ట్యాపింగ్‌లపై రేవంత్ అసత్య ప్రచారం చేస్తున్నారని మహేందర్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నిబంధనలనే రాష్ట్రంలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు కాపాడేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోలీస్ శాఖలో గ్రూపులు లేవని, అసత్య ప్రచారంలో మమల్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.…
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. కొత్త నిబంధన ప్రకారం పోలింగ్‌కు మూడు రోజుల ముందు స్థానికేతర నాయకులు హుజూరాబాద్‌ను వీడాలి. ప్రధాన పార్టీలకు నిజంగా ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. దీంతో ఆయా పార్టీలు ఇప్పుడు కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది. గత మూడు నాలుగు నెలలుగా హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటర్లు కాని టిఆర్ఎస్, బిజెపి,…
ఈ నెల 30న హుజురాబాద్ ఉప ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనుండగా, నవంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వాటి ప్రచారాల్లో దూకుడు పెంచాయి. ఉప ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త వ్యూహ్యాలను ఎంచుకుంటున్నారు. ప్రచారంలో తమ దైన శైలితో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు, ప్రభుత్వ సర్వే సంస్థలు…
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలే అంటూ ఆరోపించారు. 2 నెలల ముందు ఇదే ప్లీనరీ పెడితే కేసీఆర్ ఆడే అబద్దాలకు ఆస్కార్ వాళ్లు అవార్డు ఇచ్చే వాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు హుజూరాబాద్ లో ముఖం చెల్లక…
హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణతో పాటు దేశం దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. ఈ ఎన్నికను దేశంలోనే అత్యంత ఖరీదైనదిగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఒక్క రోజు ప్రచారంలో లక్షలు ఖర్చు పెడుతున్నారు. పొద్దుగూకితే చాలు గ్రామాల్లో మద్యం ఏరులవుతుంది. ఇదే సమయంలో రాజకీయం రంజుగా సాగుతోంది. రాత్రికి రాత్రి గ్రామ స్థాయి నాయకులను బట్టలో వేసుకుంటున్నారు. విందులు, వినోదాలతో పాటు కరెన్సీ కట్టలతో వారిని కట్టిపడేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలూ ఈ తరహా రాజకీయంలో ఆరితేరాయి. కాస్తా…