5 నెలల ఉత్కంఠకు తెరపడనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటి పోస్టల్ బ్యాలెట్‌లో ఉన్న 753 ఓట్లను లెక్కించి టీఆర్‌ఎస్ కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈవీఏంలలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మొత్తం 22 రౌండ్లలో హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ముందుగా హుజురాబాద్ ఓట్లను లెక్కించనున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైంది. అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతోనే టీఆర్‌ఎస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 753 బ్యాలెట్ ఓట్లను లెక్కించగా అందులో టీఆర్‌ఎస్‌కు ఓట్లు ఆధికంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లలో 503 టీఆర్ఎస్ కు రాగా, బీజేపీకి 159, కాంగ్రెస్ కు 32 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం హుజురాబాద్ ఓట్లను…
యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక గత నెల 30న జరిగింది. ఫలితాల కోసం రెండురోజులుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు. హుజురాబాద్ కౌంటింగ్ ప్రారంభమయింది. హుజురాబాద్ మండలంలోని 14 గ్రామాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆ తర్వాత వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల లెక్కింపు జరుగుతుంది. హుజురాబాద్‌లోని పోతిరెడ్డిపేట తొలి గ్రామం కాగా, కమలాపూర్ మండలం శంభునిపల్లి…
ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన హుజురాబాద్ ఉప ఎన్నికు ఈ రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు. కరీంనగర్ లోని ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళశాలలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఏజెంట్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పాసులు ఉన్నా మమల్ని అనుమతించడం లేదంటూ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టి వెల్లడంతో వారిని లోపలికి అనుమతించాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం మరికొద్ది గంటల్లో వెలువడనుంది.. అధికార టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు… అన్ని ప్రయత్నాలు చేసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత… మండలాల వారిగా ఇన్‌చార్జ్‌లను నియమించింది. నియోజకవర్గంలో పట్టుసాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు… విస్తృతంగా పర్యటించి… గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం మొదలు… పోలింగ్ రోజు ఓటర్లను పోలింగ్ బూతులకు చేర్చే వరకు పక్కా…
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. కరీంనగర్ లోని SR డిగ్రీ కాలేజ్ లో కౌంటింగ్ జరుగుతుందన్నారు. రెండు హాల్స్ ఉంటాయి.. 22 రౌండ్స్ లో కౌంటింగ్ జరగనున్నట్టు ఆయన వెల్లడించారు. రేపు ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తామని, ముందగా పోస్టల్ ఓట్లు లెక్కించనున్నట్టు ఆయన తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. దీనికి సంబంధించి…
భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను తెలంగాణ ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. దీంతో ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈటల. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌లో ఉప ఎన్నికకు దారితీసింది. హుజురాబాద్ లో మరోసారి టీఆర్‌ఎస్ జెండా ఎగరవేసేందుకు కేసీఆర్ తన అనుచర గణాన్ని మొత్తం ఉపయోగించారనడంలో సందేహం లేదు. హుజురాబాద్ గడ్డమీద గులాబీ జెండా రెపరెపలాడించాలని గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటిస్తూ.. మంత్రి హరీశ్‌రావుకు ఇంచార్జీ బాధ్యతలు కేసీఆర్…
హుజురాబాద్ ఎన్నికల అనంతరం వినూత్న రీతిలో దండోరా వేశారు. గ్రామ ప్రజలకు తెలియచేయునది. నిన్నటి వరకూ ఓట్ల పండుగ అయిపోయింది. మన పనులు మనమే చేసుకోవాలి. మొన్నటి వరకూ రాజకీయ నాయకులు వచ్చేవారు. ఇప్పుడు మనమే పోవాలి. మన ఛాయ్ మనమే తాగాలి. మన బువ్వ మనమే తాగాలి. బిర్యానీ మనమే తెచ్చుకోవాలి. మన మందు మనమే తాగాలి. ఉప ఎన్నిక సందర్భంగా వివిధ పార్టీల నేతలు ఊళ్ళలో సందడి చేశారు. ఆ హడావిడి అయిపోయింది. వాళ్ళకి…
హుజురాబాద్ ఉపఎన్నిక ప్రక్రియ ముగిశాక.. పాడి కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ క్లియర్ అవుతుందా? టీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచి వెయిట్ చేస్తున్న ఆయన.. ఇంకా ఎదురు చూడాలా? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది.. తేలని కౌశిక్‌రెడ్డి పదవి..! పాడి కౌశిక్‌రెడ్డి. 2018లో హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి. ప్రస్తుత ఉపఎన్నిక బ్యాక్‌డ్రాప్‌లో అనూహ్యంగా టీఆర్ఎస్‌లో చేరారు. గులాబీ కండువా కప్పుకొన్న రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్సీని చేస్తున్నట్టు అధికారపార్టీ తీపి కబురు అందించింది. గవర్నర్…
హుజురాబాద్ లో పోలింగ్ ముగిసిన తరువాత అక్కడి నుండి స్ట్రాంగ్ రూమ్ కి బయలుదేరిన బస్ లు మార్గం మధ్యలో ఒక టీఆర్‌ఎస్ నాయకుడి హోటల్ ముందు ఎలా ఆపుతారని ప్రశ్నించారు బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ. బస్ రిపేర్ అయ్యిందని చెప్పి ఈవీఎం బాక్స్ లను మార్చినట్టు వీడియోలను చూసామని, వీవీ ప్యాట్ బయటికి ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. పూర్తి భద్రత తో ఈవీఎంలు తరలించాలి. కానీ పోలీస్ లు లేకుండా ఎలా ఈవీఎంలను…