హుజూరాబాద్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేపు ఇక్కడి నుండే ఈవీఎం , పోలింగ్ సామగ్రి తీసుకొని తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్స్ కి పోలింగ్ సిబ్బంది వెళ్లనున్నారు. ఈ ఎన్నికలో మొత్తం 306 పోలింగ్ స్టేషన్స్ ఉండగా… 2 లక్షల 37 వేల 36 మంది ఓటర్లు ఉన్నారు. అయితే కోవిడ్ ప్రోటోకాల్ తో పోలింగ్ జరగనుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ లో హెల్త్ సిబ్బంది ఉంటారు. ఓటర్ కి ఓటర్ కి మధ్య 6 అడుగుల దూరం ఉండాలి. మాస్క్ తప్పని సరి. థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది. ఓటు వేసే ముందు కుడి చేతికి గ్లోవ్స్ తోడుకోవాలి. కోవిడ్ పేషెంట్స్ ఉంటే పోలింగ్ కు చివరి గంటలో అనుమతి ఉంటుంది.