హుజురాబాద్ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నిలవాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 70 శాతం తెలంగాణ ప్రజలు వ్యవసాయంపై బ్రతుకుతారు. అందులో ఎక్కువగా వరి సాగే వుంటది. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వరి సాగే అవుతుంది. సర్కార్ తుగ్లక్ పాలనలా.. నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం msp ప్రకటించింది.. దాని ప్రకారం కొనాల్సిందే. తెలంగాణను రైస్ బౌల్ చేస్తామన్నారు.. కేసీఆర్. ఇప్పుడు కొనం అని చెప్పడం సిగ్గు చేటు. సిద్దిపేట కలెక్టర్ మాట్లాడిన తీరు బాగాలేదు. సుప్రీం కోర్ట్ కెల్లిన వినను అని చెప్పడం ఏంటీ. తెలంగాణ ప్రజలు.. సర్కార్ తీరును పరిశీలిస్తుంది. వరి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాది అని తెలిపారు. పంట మార్పిడి వుంటే.. రైతులను అటు వైపు మళ్ళించే లా ప్రణాళికలు సిద్దం చేయండి. కానీ రాత్రికి రాత్రి రోడ్డున పడేలా నిర్ణయాలు తీసుకోకండి. ప్రభుత్వ అధికారులు ఆటంకాలు పెట్టొద్దని కోరుతున్నాం అని పేర్కొన్నారు.