హుజురాబాద్ ఉపఎన్నికల్లో కోవిడ్ ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలి అని హుజురాబాద్ కోవిడ్ ఆఫీసర్ డాక్టర్ శ్వేతా తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ ను సానిటైజ్ చేస్తున్నాం అని చెప్పిన ఆవిడ… 306 పోలింగ్ బూతుల్లో, 306 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లక్షణాలుంటే సెంటర్ వద్దే కరోనా టెస్ట్ చేస్తారు. ప్రతి ఓటర్ మాస్క్ ధరించాలి.. ఓటర్ల మధ్య 6 మీటర్ల దూరం పాటించాలి. దీని పై ఓటర్లను ముందే అవేర్ చేస్తున్నాం అని చెప్పిన ఆవిడ కరోనా ఉన్నవాళ్లకు, చివరి గంటలో ఓటింగ్ వేసే అవకాశం ఉంటుంది అని స్పష్టం చేసారు. ఇక అన్ని పోలింగ్ కేంద్రాల్లో పిపిఈ కీట్స్ అందుబాటులో ఉంటాయి అని పేర్కొన్నారు. ఇక రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న ఈ ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.