హుజురాబాద్ అభివృద్ధి జరగాలంటే టీఆరెఎస్ లో చేరాల్సిందే అని తన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారని.. అందరి కోరిక మేరకు తాను రేపు టీఆరెఎస్ లో చేరుతున్నట్లు కౌశిక్ రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ సమక్షంలో రేపు 1 గంటకు టీఆర్‌ఎస్ లో చేరుతున్నానని.. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని చెప్పారు.. read also : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. దళిత బంధు హుజూరాబాద్ నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందని… హుజురాబాద్ అభివృద్ధి…
మాజీమంత్రి ఈటల రాజేందర్ మరోసారి అధికార పార్టీ టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హుజురాబాద్ ఉపప్రచారంలో భాగంగా నెరెళ్ళ ఊరిలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘నెరెళ్ళ ధర్మం తప్పదన్నారు. ఎవరి ప్రచారం వారిని చేసుకోనివ్వండి. బీజేపీ పార్టీ జెండాలు పీకెయ్యడంపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, మేము తలుచుకుంటే వేరే ఉంటాడని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్లు ఎటు పోయినారు..? కేసీఆర్ దళితుల మీద ప్రేమ ఒక మోసం.. దళిత సీఎం…
కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే అన్ని పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయబోమని…అసలు హుజురాబాద్ ఎన్నికల వల్ల ఉపయోగం ఉందా ? అని ప్రశ్నించారు. ”నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? దళితులకు మూడు ఎకరాల…
కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే అన్ని పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి, సమన్వయ కర్తలను, మండల బాధ్యులను ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహను నియమించగా… నియోజక ఎన్నికల సమన్వయకర్తలుగా.. ఎమ్మెల్స్…
తెలంగాణ బీజేపీ పార్టీ పాదయాత్రతో ప్రజాక్షేత్రంలో ఉండాలని భావిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇదివరకే ప్రకటించారు. కాగా నేడు మరోసారి బండి సంజయ్ అధ్యక్షతన ఈ విషయమై సమావేశం జరిగింది. ఆగస్టు 9 నుండి ప్రారంభమయ్యే పాదయాత్ర, హుజూరాబాద్ ఎన్నికలు ప్రధాన అంశాలుగా చర్చించారు. పాదయాత్ర లక్ష్యాలు, ఉద్దేశాలను బండి సంజయ్ వివరించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక, నియంత, గడీల పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబపాలనలో…
హుజురాబాద్ ఉపఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సీనియర్ నేతకు ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించింది. దుబ్బాక ఉపఎన్నికలోనూ ఆయనే పార్టీ ఇంచార్జ్. దీంతో ఆ నేతకు ఇది పరీక్షా కాలమా.. ఇంకేదైనా వ్యూహం ఉందా అని చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు చావో రేవా? తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన ఉపఎన్నికలేవీ కాంగ్రెస్ పార్టీకి కలిసి రాలేదు. సిట్టింగ్ స్థానాలనే కోల్పోయిన పరిస్థితి. అధికారపార్టీ ముందు పేలవమైన ప్రదర్శన చేస్తూ వచ్చింది. నాయకత్వం లోపమని…
హుజరాబాద్ ఉప ఎన్నిక కోసం మండల ఇంచార్జ్ లను ప్రకటించింది బీజేపీ. హుజురాబాద్ టౌన్ ను ఇంచార్జ్ గా ఎమ్మెల్యే రఘునందన్ రావును నియమించగా హుజూరాబాద్ రూరల్ కు రేవూరి ప్రకాష్ రెడ్డి, జమ్మికుంట కు ఎంపీ అరవింద్.. జమ్మికుంట రూరల్ కు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ను నియమించింది. అలాగే వీణవంక- మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఇల్లంతకుంట- మాజీ ఎంపీ సురేష్ రెడ్డి కమలాపూర్- మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ను…
హుజురాబాద్ ఉప ఎన్నికకు సిద్దం అవుతుంది టీఆర్ఎస్. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో తెరాస నేతల సమావేశం అయ్యారు. నియోజక వర్గానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల నియామకం పై చర్చించారు. సమావేశానికి ఇంచార్జీ లు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత్ రావు, ఎమ్మెల్యే లు పెద్ది సుదర్శన్ , అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, సతీష్ బాబు, ఎమ్మెల్సీ లు పల్లా , బస్వరాజు సారయ్య, నార దాసు హాజరయ్యారు. ఈ నెల 10న…