మూసీ మురుగు నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కల్పిద్దామంటే బీఆర్ఎస్ కాళ్లలో కట్టెలు పెడుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన చేస్తా అంటే వద్దు అంటారు.. ఫ్యూచర్ సిటీ వద్దు అంటారు.. రుణమాఫీ వద్దు అంటారు.. ఇండస్ట్రీ పెడతా అంటే వద్దు అంటారు.. ఏం చేయాలి మరి అని ముఖ్యమంత్రి మండిపడ్డారు. తాను నల్లమల నుండి వచ్చానని... ఇక్కడ తొక్కితే అక్కడికి పోయారు వాళ్ళు అని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు.
Komatireddy Venkat Reddy: అసెంబ్లీలో కాళేశ్వరం నీళ్లపై జగడం మొదలైంది. మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి కోమటి రెడ్డి సవాల్ విసిరారు. నల్గొండ జిల్లాకు కాళేశ్వం నీరు చేరాయన్నా దానిపై సభలో గందగోళం ఏర్పడింది.
ఈ-కార్ రేసు వ్యవహారంలో ఎక్కడా అవినీతి జరగలేదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసులో హై కోర్టు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు అని చెప్పిందని హరీష్ రావు తెలిపారు. ఇది డొల్ల కేసు అని మొదట్లోనే తేలిపోయిందని హరీష్ రావు అన్నారు.
Minister Ponguleti: సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు బాధాకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దళితెడూర స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తించడం సమంజసమేనా?
Harish Rao Vs Speaker: ఫార్ములా-ఇ కార్ రేస్ అంశంపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించారు. ఈరోజు అసెంబ్లీలో భూ భారతి బిల్లుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా..
KTR: కేసు విషయంలో నేనేం భయపడడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిన్నటి మీడియా సమావేశం అవినీతి జరుగలేదని పొన్నం ప్రభాకర్ చెప్పారన్నారు.
Congress vs BRS: అసెంబ్లీ ప్రారంభం కాగానే ఫార్మలా ఈ కార్ రేస్ అంశంపై కాంగ్రెస్ మాట్లాడాలని బీఆర్ఎస్ పట్టుబడింది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూ భారతి బిల్లుపై చర్చను ప్రారంభించారు.
Harish Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారని అసెంబ్లీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కేటీఆర్‌ను అప్రతిష్టపాలు చేసి బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలని
శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య వాడీవేడి సంభాషణ జరిగింది. క్వశ్చన్ అవర్‌లో ఒక మంత్రి.. మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు. మంత్రులే ప్రశ్నలు అడిగితే.. ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. అందుకు కోమటిరెడ్డి ఘాటుగా స్పందించారు. హరీశ్ రావు బీఆర్ఎస్కు డిప్యూటీ లీడరా?, ఎమ్మెల్యేనా?.. ఏ హోదాతో మాట్లాడుతున్నారు?, ఆయనకు ప్రశ్నించే హక్కు లేదన్నారు. ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు రాకపోవడం తెలంగాణ ప్రజలను అవమానపరచడమే…
అదానీ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లు చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని.. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాజ్‌భవన్ ముట్టడిలో కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. మేము రేవంత్ రెడ్డి, అదానీ ఫోటోతో అసెంబ్లీకి వస్తే మమ్మల్ని అడ్డుకున్నారన్నారు.