Komatireddy Venkat Reddy : ఓఆర్‌ఆర్ అమ్ముకున్న వాళ్ళ పై విచారణ కి అదేశించామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం 7 వేల కోట్లకు అమ్మిందని ఆయన అన్నారు. హరీష్ రావు కి.. మామ మీదనో.. బామ్మర్ది మీదనో కోపం తోటి అసెంబ్లీ లో విచారణ కి డిమాండ్ చేశారన్నారు. సీఎం విచారణకు ఆదేశించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ ఫార్ములా రేసు కేసులో ఒకరో ఇద్దరో జైలుకి పోతారని, ఓఆర్‌ఆర్ ఎపిసోడ్ లో కూడా జైలు కి వెళ్తారన్నారు. RRR కి అరెండ్లు ఆలస్యం అయ్యిందన్నారు మంత్రి కోమటిరెడ్డి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చామని, టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. మార్చిలో RRR పనులు ప్రారంభమవుతాయన్నారు.
Manohar Rao: పీవీ భౌతికకాయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కూడా ఉంచలేదు: పీవీ సోదరుడు
ఇదిలా ఉంటే.. RRR ఉత్తర భాగం నిర్మాణానికి టెండర్ల ప్రక్రియకు కేంద్రం ప్రకటన చేయడం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆర్ఆర్ఆర్ పనులకు కీలక ముందడుగు పడడంతో… మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు. అందుకు కోమటిరెడ్డి బదులిస్తూ… మీ చొరవ, కృషి, సహకారం, సలహాలతోనే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కిందని రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. 2017లో ఆగిపోయిన ప్రాజెక్టు… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే మీ సహకారం వల్ల తిరిగి ప్రారంభమైందని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
Bhatti Vikramarka: నేడు బట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం..