Harish Rao : 80 లక్షల మంది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. విజయవంతంగా రైతు భరోసాని సీఎం ఎగ్గొట్టారన్నారు. రైతు భరోసాలో కోతలు పెట్టడానికి సీఎం, మంత్రులు కష్టపడుతున్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు పంటలకు రైతు భరోసా ఇవ్వాలన్న రేవంత్ ఇప్పుడు మాట మార్చారన్నారు హరీష్ రావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ నాలుకకు నరం లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారని, తెలంగాణలో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. కొత్తగా రైతు భరోసా కోసం అప్లికేషన్లు అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతులకు బేడీలు వేసి అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇపుడు రైతుల్ని దరఖాస్తుల పేరుతో దోషుల్లా చూస్తుందని, రైతులు మళ్ళీ పైరవికారులు, కాంగ్రెస్ నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగేలా చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ ఉన్నప్పుడు టింగుటింగు మని రైతు బంధు వచ్చేదని, ఇప్పుడైతే 10 వేలు మేమోస్తే 15 వేలు అన్న కాంగ్రెస్ ఇప్పుడు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్నారు హరీష్ రావు.
అంతేకాకుండా..’కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. కాంగ్రెస్ పార్టీ లీకులు ఇచ్చి కొన్ని వార్తలు రాయిస్తుంది.. పంట పండించే భూములకు రైతు భరోసా ఇస్తామంటున్నారు.. దీనివల్ల పండ్ల తోటలు, ఆయిల్ పామ్, చెరుకు రైతులు నష్టపోతారు.. కొండలు గుట్టలు ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వమని అంటున్నారు.. కొండల్లో, గుట్టలో దళిత గిరిజనులు భూములు సాగు చేస్తారు.. దళితులు, గిరిజనులు అంటే కాంగ్రెస్ పార్టీకి పట్టదా.. అందరికి అన్నం పెట్టే రైతును అడుక్కుతినేలా చేయకండి.. 4 తేదీన క్యాబినెట్ మీటింగ్ లో రైతు భరోసాపై చర్చిస్తారని తెలిసింది.. ఒక వేళ ఒకే పంట పండించే భూముల రైతులకి రైతు భరోసా ఇవ్వకపోతే తస్మాత్ జాగ్రత్త.. జరగబోయే పర్యవసాలకు మీరే బాధ్యత వహించాలి.. 2 లక్షలు పైన రుణాలు ఉన్న రైతులకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారో సీఎం చెప్పాలి.. సీఎం మాట నమ్మి 2 లక్షల పైన రుణం ఉన్న రైతులు అప్పు తెచ్చి కట్టి ఇంకా అప్పుల పాలయ్యాడు.. 2 లక్షల లోపు ఉన్న సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు.. 11 సార్లు కేసీఆర్ రైతుభందు ఇచ్చారు…రైతుల సమాచారం మొత్తం ఉన్న మళ్లీ కొత్తగా అప్లికేషన్లు ఎందుకు..? తెలంగాణలో 54 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉంటే ఒక కోటి 4 లక్షల మంది కూలిలు ఉన్నారు.
Naga Vamsi : నాగవంశీపై స్కామ్ 1992 డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
దీంట్లో కూడా ఏరివేతలు మొదలుపెడుతుంది కాంగ్రెస్.. ఇది అన్యాయం.. మే నెలలో ఉపాధిహామీ పనులకు 850 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చాయి.. ఈ డబ్బులు కూలీలకు ఇవ్వకుండా దారి మళ్లించింది కాంగ్రెస్.. మూడు నెలల్లో ఉపాధిహామీ డబ్బులు చెల్లించకపోతే వడ్డీతో సహా తిరిగి కేంద్రానికి చెల్లించాలి.. 7 నెలలు అయినా ఉపాధిహామీ డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలి.. తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం.. కానీ ఏడాదిగా తెలంగాణలో నేరాలు పెరిగిపోయాయి.. 23 శాతం నేరాలు పెరిగి తెలంగాణ ఎల్లో జోన్ లోకి వెళ్ళిపోయింది.. ఇలాగే పరిస్థితి ఉంటే ఇంకొన్ని రోజుల్లో రెడ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది.. ఇలా అయితే రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రావు.. డయల్ 100 పనితీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దారుణంగా పడిపోయింది’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
Highest Salary In The World: ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న భారతీయుడు.. రోజుకు 48 కోట్లు!