బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్.. తెలంగాణ ప్రజలు ఏం అనుకుంటారో అనే సోయి లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణను ఏటీఎం లాగ వాడుకుని లూటీ చేసి.. ఇప్పుడు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలోనైనా.. కేటీఆర్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి కోరుతున్నట్లు తెలిపారు. మరోవైపు.. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు వస్తారు అనుకున్నా.. మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో కేసీఆర్ మంత్రిగా పని చేశారు.. కనీసం అందుకైన సభకు వచ్చి సంతాపం చెప్తారు అనుకున్నా.. కానీ రాలేదన్నారు.
Read Also: Kalki 2898 AD: కల్కి సినిమాకి అరుదైన ఘనత
వచ్చే ఏడాదిలో హరీష్ రావు, కేటీఆర్‌లకు సినిమా చూపిస్తామని బీర్ల ఐలయ్య హెచ్చరించారు. సంక్రాంతికి రైతులకు రైతు భరోసా ఇస్తామని.. నిజమైన రైతులకు రైతు భరోసా ఇస్తామని తెలిపారు. మరోవైపు.. బీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. 2018లో ఉన్న రిజర్వేషన్ తగ్గించింది బీఆర్ఎస్ అని తెలిపారు. కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం.. ఇప్పటికే కవిత బెయిల్ మీద ఉంది.. కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉన్నాడు.. హరీష్ కొత్త దారులు వెతుక్కుంటున్నారని బీర్ల ఐలయ్య తెలిపారు.
Read Also: SP Sindhu Sharma: ట్రై యాంగిల్ సూసైడ్ కేసులో ఎలాంటి ఐ విట్నెస్లు లేవు..
2025లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అంటున్నాడు కేటీఆర్.. బావ బామ్మర్దిలు కలిసి కేసీఆర్ ను సభకు రానివ్వడం లేదు.. పార్టీ అధ్యక్షుడి సంగతి ఏంటో..? అని బీర్ల ఐలయ్య ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటి అయ్యారు కాబట్టి.. బీఆర్ఎస్ కి ఒక్క సీటు రాలేదని అన్నారు. లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న కవిత.. బీసీల గురించి మాట్లాడుతున్నారు.. మీరు బీసీలను మోసం చేస్తేనే కదా.. మిమ్మల్ని ఓడగొట్టిందని బీర్ల ఐలయ్య వ్యాఖ్యానించారు.