హై కోర్టు తీర్పుపై న్యాయవాదులతో మాట్లాడుతున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ.. "కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టారు. ఈ ఏడాదిలో అన్ని విషయాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది అని సర్వే రిపోర్ట్ వచ్చింది. అది డైవర్ట్ చేయడానికే కేటీఆర్ పై కేసు పెట్టారు. కుట్ర తో చేస్తున్నారు అని క్లియర్ గా తెలుస్తోంది. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నోటీస్ ఇచ్చినందుకు కేటీఆర్ విచారణకు వెళ్లారు.
Kadiyam Srihari : బీఆర్ఎస్ పై, కేసీఆర్ కుటుంబంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇవాళ జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో గ్రామస్తులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కవిత ఇప్పటికే జైలుకు వెళ్లివచ్చింది.. కేటీఆర్ రేపో మాపో అరెస్టు అవుతారన్నారు. హరీష్ రావు, కేసీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కుటుంబం పది…
Komatireddy Venkat Reddy : రైతు భరోసా పై… పనికి మాలిన వాడు… పని లేనోడు విమర్శలు చేస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. RRR లో 12 వేల కోట్ల అవినీతి అని కేటీఆర్ అంటున్నాడని, టెండర్ పిలిచింది 7 వేల కోట్లే అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కేటీఆర్..హరీష్ మానసిక పరిస్థితి సరిగలేదని ఆయన సెటైర్ వేశారు. అధికారం ఇక రాదని అర్థమైంది వాళ్లకు…
రేపు రాజమౌళి- మహేశ్ సినిమా పూజా కార్యక్రమం టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటి…
Harish Rao : 80 లక్షల మంది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. విజయవంతంగా రైతు భరోసాని సీఎం ఎగ్గొట్టారన్నారు. రైతు భరోసాలో కోతలు పెట్టడానికి సీఎం, మంత్రులు కష్టపడుతున్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు పంటలకు రైతు భరోసా ఇవ్వాలన్న రేవంత్ ఇప్పుడు మాట మార్చారన్నారు హరీష్ రావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ నాలుకకు నరం లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారని, తెలంగాణలో సగం మంది…
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పని చేస్తున్న 6,000 మంది ఆర్పీలకు వెంటనే వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అయినా ఆర్పీలకు పెండింగ్ జీతాలను చెల్లించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకే జీతాలు చెల్లించకుండా.. వారిని పేదరికంలోకి నెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు…
బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్.. తెలంగాణ ప్రజలు ఏం అనుకుంటారో అనే సోయి లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణను ఏటీఎం లాగ వాడుకుని లూటీ చేసి.. ఇప్పుడు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలోనైనా.. కేటీఆర్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి కోరుతున్నట్లు తెలిపారు.
Harish Vs Ponnam: దేశానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని హరీష్ రావు అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి అనూహ్యంగా ఎదిగారన్నారు. అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..
బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 72,659 కోట్లు ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉంది.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తామని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, దుదిల్ల శ్రీధర్ బాబు,…
Harish Rao : రాష్ట్రంలో మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని, ప్రభుత్వ వైఫల్యానికి ఇదే నిదర్శనమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గత సంవత్సరంతో పోలిస్తే తెలంగాణలో నేరాల రేటు 22.5% పెరిగిందన్నారు. అత్యాచార కేసులు 28.94% పెరిగాయని, ఏడాదిలో మొత్తం 2,945 కేసులు నమోదయ్యాయన్నారు. సగటున రోజుకు 8 కేసులు నమోదవుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఇందులో 82 మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరగడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్…