సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో కరోనా పై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి హరీశ్‌రావు అనంతరం మాట్లాడుతూ… దేశమంతా కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంపై మాత్రమే ప్రేమ కురిపిస్తున్నది. గుజరాత్ కి 1లక్షా 63వేల వ్యాక్సిన్లను పంపించగా, తెలంగాణకు కేవలం 21వేల వ్యాక్సిన్లనే పంపించింది అని తెలిపారు. తెలంగాణపై ఇంత చిన్నచూపు ఎందుకు, తెలంగాణ ఈ దేశంలో లేదా, తెలంగాణ ప్రజలవి ప్రాణాలు కావా అని అన్నారు. వ్యాక్సిన్ల విషయంలోనూ…
గతంలో వర్షాలు పడితేనే చెరువులు,వాగులు నిండేది కానీ నేడు కాలంతో పనిలేకుండా వాగులు అన్ని మత్తడులు దుంకుతున్నాయి. తెలంగాణ రావడం వల్లనే కాళేశ్వరం జలాలు హల్దీ వాగులోకి వచ్చినాయి అని మంత్రి హరీష్ రావ్ అన్నారు. గత ప్రభుత్వాలకు తెలంగాణ నీటిని ఆంధ్రాకు మళ్ళించుడు మాత్రమే తెలుసు.. కానీ తెలంగాణ నీటిని తెలంగాణ పంట పొలాలకు తరలించడం కెసిఆర్ ప్రభుత్వానికి తెలుసు. గత కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాలను ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి అప్పజెప్పారు. నేడు గోదావరి…